- క్వింటాకు రూ.22 వేల వరకు ధర
మధిర, వెలుగు: ఖమ్మం జిల్లా మధిర వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం మిర్చి కొనుగోళ్లను మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు మిర్చి కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మధిర వ్యవసాయ మార్కెట్ యార్డును రెగ్యులర్ మార్కెట్ యార్డుగా అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీ ఇచ్చారని తెలిపారు.
భవిష్యత్తులో రైతులు పండించే పంటలకు ఇక్కడ విక్రయాలు జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మార్కెట్‌లో మిర్చికి అత్యధికంగా క్వింటాకు రూ.22 వేల ధర లభించిందన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కోల్డ్ స్టోరేజ్ యజమానులు, రైతులు పాల్గొన్నారు.
