ఉక్రెయిన్ శరణార్థిని పొడిచి చంపిన దుండగుడు.. అమెరికాలో రైలులో ఘటన

ఉక్రెయిన్ శరణార్థిని పొడిచి చంపిన దుండగుడు.. అమెరికాలో రైలులో ఘటన

న్యూఢిల్లీ: ఉక్రెయిన్ నుంచి ప్రాణరక్షణ కోసం అమెరికాకు వచ్చి తలదాచుకుంటున్న శరణార్థిని ఓ నేరస్తుడు కత్తితో పొడిచి చంపాడు. అమెరికాలోని  నార్త్  కరోలినా రాష్ట్ర చార్లెట్ సిటీలో గత నెల 22న ఈ దారుణం జరిగింది. ఇరినా జరుట్ స్కా (23) యుద్ధం కారణంగా ఉక్రెయిన్  నుంచి అమెరికాకు వచ్చి చార్లెట్  సిటీలో నివాసముంటోంది. గత నెల 22న రాత్రి లోకల్  రైలెక్కింది. ఆమె కూర్చున్న సీటు వెనుక డికార్లోస్  బ్రౌన్  జూనియర్ (34) అనే పాత నేరస్తుడు కూర్చున్నాడు. కొంత సేపయ్యాక అతను తన  వద్ద ఉన్న కత్తితో ఇరినాపై కత్తితో దాడి చేశాడు. మెడపై పొడవడంతో ఇరినా చనిపోయింది.