మనుషుల్లోనే కాదు చింపాంజీల్లోనూ ప్రేమానురాగాలు

మనుషుల్లోనే కాదు చింపాంజీల్లోనూ ప్రేమానురాగాలు

ఎంత కొట్లాడుకున్నా..ఎన్ని తిట్టుకున్నా..రక్తసంబంధం రక్తసంబంధమే. అన్నదమ్ములైనా..అక్కచెల్లెలైనా..బాల్యంలో వారితో గడిపే సమయం..అందులో లభించే సంతోషం వెలకట్టలేనిది. అన్నదమ్ములు..అక్కచెల్లెల్ల మధ్య ప్రేమానురాగాలు, సంతోషాలు ఎప్పటికీ మధుర జ్ఞాపకాలే. అయితే ఈ ప్రేమలు, అనురాగాలు..మానువుల్లోనే కాదు..జంతువుల్లోనూ కనిపిస్తాయి. తాజాగా రెండు చింపాంజీలు తమ తోబుట్టువులపై కురిపించిన ప్రేమ..వాత్సల్యం ఇంటర్నెట్ లోకాన్ని కదిలిస్తోంది. చాలా రోజుల తర్వాత కలుసుకున్న రెండు చింపాంజీలు భావోద్వేగంతో హత్తుకున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తుంది. 

అన్నదమ్ములైన చింపాంజీలను..చికిత్స కోసం..కొన్ని రోజులు వేర్వేరు ప్రాంతాలకు జూ సిబ్బంది తరలించారు. చికిత్స ముగిసిన తర్వాత వాటిని మళ్లీ జూకు చేర్చారు. దీంతో చాలా కాలం తర్వాత అన్నదమ్ములిద్దరు కలవడంతో..రెండు చింపాంజీలు భావోద్వేగానికి గురయ్యాయి. ఒకర్నొకరు హత్తుకున్నాయి.  ఆనందభాష్పాలతో తమ ప్రేమను చాటుకున్నాయి.  ఈ వీడియో చూసిన నెటిజన్ల కుటుంబ బంధాలు ఎప్పటికి విచ్ఛిన్నం కావంటూ కామెంట్లు పెడుతున్నారు.