ఆహార సంక్షోభంలో చిక్కుకున్న చైనా!

ఆహార సంక్షోభంలో చిక్కుకున్న చైనా!

తిండిలేక బార్డర్ పై పడిన్రు

ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇండియాతో కయ్యం?

నాటి మావో జెడాంగ్ వ్యూహాన్ని ఫాలో అవుతున్న జిన్ పింగ్

బీజింగ్/న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశం చైనా. అతిపెద్ద ఆర్థికవ్యవస్థ కలిగిన టాప్ 5 దేశాల్లో ఒకటి.. అమెరికాను దాటి ప్రపంచ పెద్దన్నగా నిలవాలని కలలుగంటోంది. కానీ ఇదంతా నాణేనికి ఒకవైపు. ప్రస్తుతం చైనా ఆహార సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ఆ సమస్య నుంచి ప్రజల ద`ష్టి మళ్లించేందుకు బార్డర్ సమస్యను స`ష్టించింది. ఇండియాతో కావాలనే కయ్యాలు పెట్టుకుని పబ్బం గడుపుకోవాలని చూస్తోందని ఎక్స్ పర్టులు కూడా చెబుతున్నారు. అప్పట్లో మావో జెడాంగ్ అనుసరించిన వ్యూహాన్ని ఇప్పుడు జిన్ పింగ్ ఫాలో అవుతున్నాడని అంటున్నారు.

‘ప్లేట్ క్లీన్ చేసుకోండి’

చైనా ఫుడ్ క్రైసిస్ లో చిక్కుకుందని స్వయానా ఆ దేశ అధ్యక్షుడు జిన్ పింగ్ ఈ మధ్య ప్రకటించారు. 2013 నాటి ‘క్లీన్ యువర్ ప్లేట్’ కార్యక్రమాన్ని మరోసారి ప్రారంభించారు. ప్రజలు ఖర్చులను తగ్గించుకోవాలని సూచించారు. ఆహార సంక్షోభం మరింత ముదురుతుందన్న భయంతో ‘డైవర్షన్’ మెథడ్ స్టార్ట్ చేశారు. ఇండియాతో బార్డర్ గొడవను మొదలుపెట్టారు. పరిస్థితి చల్లారకుండా.. ఉద్రిక్తతలు కొనసాగేలా వ్యవహరిస్తున్నారు. మొన్నటి గల్వాన్ గొడవ.. నిన్నట పాంగోంగ్ సో లేక్ వ్యవహారమే ఇందుకు ఉదాహరణ. మరోవైపు అమెరికాతో ట్రేడ్ వార్ కారణంగా అక్కడి నుంచి ఆహార దిగుమతులు భారీగా తగ్గిపోయాయి. కరోనా నేపథ్యంలో ఇండియా, వియత్నాం.. వరి ఎగుమతిపై ఆంక్షలు విధించాయి. మరోవైపు ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వల్ల 100 మిలియన్ల పందులను చంపారు. ఫుడ్ క్రైసిస్ కు ఇది ప్రధాన కారణం.

అచ్చం మావో మాదిరే..

1962లో ‘గ్రేట్ లీప్ ఫార్వర్డ్ మూమెంట్’ను నాటి దేశాధినేత మావో జెడాంగ్ తీసుకువచ్చారు. దీనిపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఎంతో మంది చనిపోయారు. తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇండియాను మావో ఈజీ టార్గెట్ గా చేసుకున్నారు. 1962లో మనతో సరిహద్దు వివాదాన్ని స`ష్టించారు. ఇప్పుడు జిన్ పింగ్ కూడా ఆహార సంక్షోభ సమస్యను పరిష్కరించలేక, ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా, దృష్టి మరల్చేందుకు బార్డర్ అంశాన్ని లేవనెత్తారు. ఆయనకు అక్కడి ప్రభుత్వ మీడియా వంతపాడుతోంది. కొన్ని ప్రావిన్స్‌‌ లలో పంట నష్టం వల్ల ఏర్పడిన ఆహార సంక్షోభంపై ఎలాంటి వార్తలూ ప్రచురించడం లేదు. పైగా ఆహార ఉత్పత్తిపై కరోనా, మిడతల దాడి ప్రభావాన్ని ప్రభుత్వం సమర్థంగా నియంత్రించినట్లు డబ్బా కొట్టింది. భారీ వర్షాల వల్ల పంటలు నష్టపోతున్నా పరిస్థితి అదుపులోనే ఉందని ప్రచారం చేస్తోంది.

For More News..

బీఈడీ కోర్సుల ఫీజ్ పెంచిన ప్రభుత్వం

సెక్రటేరియట్ చెట్ల తరలింపుకు 5 కోట్లు

ఈఎస్​ఐ స్కామ్​లో 4.5 కోట్లు సీజ్​