పుల్వామాలో CRPFజవాన్లపై జరిగిన దాడిని ఖండిస్తూనే తన వక్రబుద్దిని చాటుకుంది చైనా. ఈ రోజు చైనా విదేశాంగ మంత్రి గెంగ్ షుయాంగ్ మీడియాతో మాట్లాడుతూ.. భారత్ లో జరిగిన ఉగ్రదాడిని ఖండించారు. అమరుల కుటుంబాలకు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నట్లు చెప్పారు. తాము ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని అక్కడి మీడియాకు తెలిపారు.పుల్వామాలో ఉగ్రదాడి జరిపిన జైషే మహమ్మద్ చీఫ్ అజర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేందుకు చైనా ఎందుకు నిరాకరిస్తూవస్తుందని.. అక్కడి మీడియా ప్రతినిధులు చైనా విదేశాంగ మంత్రిని అడిగారు. దీంతో సరైన ఆదారాలు లేవని అందుకే తాము.. వసూద్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించడంలేమని గెంగ్ షుయాంగ్ తెలిపారు.
ఐక్యరాజ్యసమితిలో మసూద్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న భారత్ ప్రతిపాదనను చైనా తనకున్న వీటో పవర్ తో తిరస్కరిస్తూవస్తుంది. ఈ విషయంలో భారత్ కు అమెరికాతో పాటు పలు దేశాల సపోర్ట్ ఉన్నా.. చైనా మాత్రం ఇందుకు అంగీకరించడం లేదు. ఇప్పుడు జరిగిన దుర్గటన జైషే మహమ్మద్ చేసిందే. అయినా జైషే చీఫ్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేందుకు చైనా రెడీగా లేదు.
