అరుణాచల్ ప్రదేశ్ మ్యాప్ కోసం ప్రపంచ పటాలను కాలబెట్టిన చైనా

అరుణాచల్ ప్రదేశ్ మ్యాప్ కోసం ప్రపంచ పటాలను కాలబెట్టిన చైనా

చైనా విపరీత ధోరణి పీక్స్ కు వెళ్లింది. ఆ దేశంలో తయారై విదేశాలకు ఎగుమతి అవుతున్న 30వేల ప్రపంచ పటాలను కాలబెట్టింది. ఇందుకు కారణం.. ఆయా పటాలలో అరుణాచల్ ప్రదేశ్, తైవాన్, సౌత్ భూటాన్ చైనాలో భాగంగా ఉండటపోవటమే. ఈ విషయాన్ని చైనా మీడియా వెళ్లడించింది.

చైనా లోని ఓ కంపెనీ ప్రపంచ పటాలను తయారు చేసి వేరే దేశాలకు ఎగుమతి చేస్తుంది. ఇందులో భాగంగా..మ్యాపులు ఎగుమతి చేస్తుండగా.. చైనా కస్టమ్స్ అధికారులు ఆ మ్యాపులను గమనించారు. అందులో అరుణాచల్ ప్రదేశ్, తైవాన్, సౌత్ భూటాన్… చైనా భూభాగంలో లేవని గుర్తించారు. దీంతో ఆ మ్యాపులన్నింటినీ కాలబెట్టారు చైనా అధికారులు.

భారత్ లో బాగమైన అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మన దేశ ప్రధాని, కేంధ్ర మంత్రులు పర్యటిస్తున్నప్పుడు చైనా వింత వాదనలు చేనేది. అరుణాచల్ ప్రదేశ్ తమ దేశంలో భాగమని చైనా వాధించేది. ఈ చర్యలను భారత్ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తుంది.