పిల్లల్ని కనేందుకు రూ. 25 లక్షల లోన్!

పిల్లల్ని కనేందుకు రూ. 25 లక్షల లోన్!

బీజింగ్: మొన్నటివరకూ ‘ఒక్కరు చాలు.. ఇద్దరు వద్దు..’ అన్న చైనాలో ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది. గత కొన్నేండ్లుగా జనాభా పెరుగుదల రేటు తగ్గిపోతుండటం, రాబోయే కొన్నేండ్లలో యువత శాతం భారీగా పడిపోయే ప్రమాదం కన్పిస్తుండటంతో ఇప్పుడు ‘‘పిల్లలను కనండి..’’ అంటూ ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించే పరిస్థితి వచ్చింది. ఇందులో భాగంగా జిలిన్ ప్రావిన్స్ ప్రభుత్వం పెండ్లి చేసుకుని, పిల్లలను కనాలనుకునే వాళ్లకు 2 లక్షల యువాన్ ల (రూ. 25 లక్షలు) బేబీ లోన్ సౌలతు కల్పిస్తామని ప్రకటించింది. ఇందుకోసం బ్యాంకులకు సపోర్ట్ చేయాలని కూడా ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై ఇంకా పూర్తిస్థాయి ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ, ఈ మ్యారేజ్, బేబీ లోన్ లపై కట్టే మిత్తీల్లో భారీగా డిస్కౌంట్ ఇవ్వాలని సర్కారు భావిస్తోంది.