
చైనా దేశం అరుణాచల్ ప్రదేశ్ యువకులను విడిచిపెట్టింది. ఆ ఐదుగురు వాస్తవాధీన రేఖను పొరపాటున దాటివెళ్లినట్లు చెబుతూ భారత ఆర్మీ ప్రకటించింది. చైనా భూభాగంలో ఇవాళ(శనివారం) ఉదయం ఈ ఘటన జరిగింది. కిభిథు సరిహద్దు పోస్టు ద్వారా భారత్‌లోని అరుణాచల్ ప్రదేశ్ కు ఆ ఐదుగురిని భారత సిబ్బంది తీసుకొచ్చారు. ఇండో టిబెటన్ భద్రతా దశాలు… స్థానికులను సహాయకులుగా వినియోగించుకుంటాయి. వారితో తమకు అవసరమైన సామగ్రిని తెప్పించుకుంటుంటాయి.ఈ క్రమంలోనే అరుణాచల్ ప్రదేశ్‌లో సుబన్‌సిరి జిల్లాకు చెందిన ఐదుగురు దారి తప్పిపోయారు. దీంతో సరిహద్దుల దగ్గర వారిని చైనా సైన్యం తమ అధీనంలోకి తీసుకుంది. మొదట తమకు వారి జాడ గురించి తెలియదన్న చైనా…ఆ తర్వాత వారు తమ దగ్గరే ఉన్నట్లు ప్రకటించింది.