బార్డర్‌‌లో 60 వేల చైనా సైనికులు

బార్డర్‌‌లో 60 వేల చైనా సైనికులు

ఇండియాకు తమ సాయం అవసరం అంటున్న పాంపియో

న్యూఢిల్లీ: ఇండో-చైనా సరిహద్దు ఉద్రిక్తతలపై అమెరికా స్పందించింది. భారత్‌‌కు చైనాతో ముప్పు పొంచి ఉందని అమెరికా సెక్రటరీ మైక్ పాంపియో అన్నారు. ఇండియాలోని నార్తర్న్ బార్డర్ వద్ద చైనా 60 వేల సైన్యాన్ని మోహరించిందన్నారు. డ్రాగన్‌‌తో పోరులో భారత్‌‌కు అమెరికా అవసరం అత్యావశ్యకమని చెప్పారు. క్వాడ్ దేశాలైన యూఎస్, ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్ విదేశాంగ శాఖ మంత్రులు టోక్యోలో సమావేశమయ్యారు. ఇండో-పసిఫిక్, సౌత్ చైనా సముద్రంతోపాటు ఈస్టర్న్ లడఖ్‌‌లో లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి చైనా దూకుడుగా వ్యవహరిస్తుండటం, మిలటరీని భారీగా మోహరిస్తుండటంతో క్వాడ్ దేశాలు ఈ మీటింగ్ నిర్వహించాయి.

‘క్వాడ్‌‌గా పిలిచే ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్ విదేశాంగ మంత్రులతో నేను సమావేశమయ్యా. ఈ నాలుగూ అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలు. అలాగే నాలుగు శక్తిమంతమైన ఆర్థిక దేశాలు. ఈ నాలుగు కంట్రీస్ కూడా చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీతో ముప్పును ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా ఇండియా భౌతికంగా దీన్ని ఫేస్ చేస్తోంది. నార్త్ ఈస్టర్న్ ఇండియాలోని హిమాలయాల్లో చైనా సైన్యాలు మోహరించి ఉన్నాయి. అక్కడికి చైనా భారీగా సైన్యాన్ని తరలిస్తోంది. చైనాను ఎదుర్కోవడానికి ఇండియాకు మా అవసరం ఉంది. ఓ భాగస్వామిగా మేం అక్కడ పోరాడుతాం’ అని ల్యారీ ఓకానర్‌‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాంపియో పేర్కొన్నారు.