నేలపై దూసుకెళ్లే పడవ : చైనా వాడి క్రియేటివిటీ

నేలపై దూసుకెళ్లే పడవ : చైనా వాడి క్రియేటివిటీ

దీని పేరు మెరీన్ లిజర్డ్ . ఉభయచరం. ఇటునేలపైన, అటు నీళ్లపైనా దూసుకెళ్లగలుగుతుంది. ప్రపంచంలోనే మొట్టమొదటి డ్రోన్ బోట్ఇది. మూడు దిక్కుల నుంచి పొంచి ఉన్న ముప్పును తరిమికొడుతుంది. అంటే నేల, నింగి, నీరు.. ఏదైనాముప్పుగా పరిణమించే డ్రోన్లను తిప్పికొడుతుందట.మన పొరుగు దేశం చైనా దీనిని తయారు చేసింది.చైనా షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ కార్పొరేషన్ (సీఎస్ ఐసీ)ఆధ్వర్యంలో వుచాంగ్ షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ గ్రూప్దీనికి రూపునిచ్చింది. ఇప్పటికే అన్ని టెస్టుల్లోనూ అదిపాసైందని, ఏప్రిల్ 8నే ఫ్యాక్టరీ నుంచి ఆర్మీ దగ్గరకుబయల్దేరిం దని ఓ అధికారి చెప్పారు. 1200 కిలోమీటర్ల రేంజ్ లోని లక్ష్యాలను మెరీన్ లిజర్డ్ ఛేదిస్తుందని అన్నా రు. దీన్ని ఎక్కడో దూరం నుంచి కూడా ఆపరేట్చేయొచ్చట. ఉపగ్రహాల ద్వారా నియంత్రించొచ్చట.అంటే దీన్ని నడిపేందుకు, ఆపరేట్ చేసేందుకుఫిజికల్ గా సైన్యం అవసరం ఉండదన్నమాట.

శత్రు కంటికి  చిక్కదు

నీళ్లలో డీజిల్ హైడ్రోజెట్ సాయంతో గంటకు 90 కిలోమీటర్ల వేగం (50 నాట్స్ )తో దూసుకెళుతుందట.అలా వెళ్లేటప్పుడు ఎవరి కంటా పడకుండా ఉండడమేదీని స్పెషాలిటీ. అంటే స్టెల్త్​ టెక్నాలజీ అన్నమాట.ఇక, నేలపైకి వచ్చేసరికి దాని బాడీకి కింది భాగంలోఉండే నాలుగు ట్రాక్ యూనిట్లను బయటకు రిలీజ్ చేస్తుందట. వాటితో గంటకు 20 కిలోమీటర్ల వేగంతో వెళ్లిపోతుందట. వాటికి పెద్ద ట్రాక్ యూనిట్లను పెడితే నేల మీద కూడా వేగం పెరుగుతుందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అధికారి చెప్పాడు. ఎలక్ట్రోఆప్టికల్ సిస్టమ్, రాడార్ వ్యవస్థలు దీని సొంతం.శత్రు మూకలపై బు ల్లెట్ల వర్షం కురిపించేందుకు రెండు మెషీన్ గన్ లనూ అందులో పెట్టారు. నౌకలు,యుద్ధ విమానాలపై క్షిపణులను ప్రయోగించడానికివీలుగా వర్టికల్ లాంచింగ్ సిస్టం (పైకి నిలువుగాప్రయోగించడం)ను ఏర్పాటు చేశారు. తనంతటతానే రూట్లను ప్లాన్ చేసుకుంటూ అన్ని అడ్డంకులను దాటగలుగుతుందట ఈ డ్రోన్ బోట్ . అంతేకాదు,చైనా బీడూ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ కలిగి ఉన్నమెరీన్ లిజర్డ్ .. ఇతర యుద్ధ యూనిట్లతో కలిసి పనిచేస్తూ తన వంతు సహకారం అందిస్తుందట. డ్రోన్షిప్పులు, నిఘా డ్రోన్లతో కలిసి నింగి-నేల–నీరు కలిపి ఇంటిగ్రేటెడ్ కంబాట్ సిస్టమ్ ను ఇది ఫాంచేస్తుందట.దాని వల్ల ప్రాణ నష్టం తగ్గడమే కాకుండా సమర్థమైన ఫలితాలను ఇస్తుందట. వీలైతే బయటి దేశాలకూవాటిని అమ్ముతామని అధికారులు చెబుతున్నారు.