తైవాన్ దేశం చుట్టూ చైనా యుద్ధ విన్యాసాలు : కాలు దువ్వుతున్న డ్రాగన్

తైవాన్ దేశం చుట్టూ చైనా యుద్ధ విన్యాసాలు : కాలు దువ్వుతున్న డ్రాగన్

చైనా మరోసారి తన బుద్దిని ప్రదర్శించింది. తైవాన్ పై మరోసారి బెదిరింపులకు పాల్పడింది. ద్వీపం చుట్టూ చైనా సైనిక దళం డ్రిల్స్ నిర్వహించింది. శాశ్వత స్వతంత్ర దేశంగా ప్రకటించుకునేందుకు ప్రయత్నిస్తోన్న తైవాన్.. పశ్చిమ దేశాలతో తమ సంబంధాలను మెరుగుపర్చుకోవాలని, బలోపేతం చేసుకోవాలని చూస్తోంది. అందులో భాగంగానే ఇటీవల పరాగ్వే పర్యటనకు వెళ్లిన తైవాన్ ఉపాధ్యక్షుడు విలియం లాయ్.. శాన్ ఫ్రాన్సిస్కో, న్యూయర్క్ నగరాలను కూడా సందర్శించారు. ఈ క్రమంలోనే ఆయన అమెరికా మీడియా సంస్థ అయిన బ్లూమ్ బర్గ్ కు ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. తైవాన్ స్వతంత్ర దేశమని ఆయన ఈ ఇంటర్వ్యూలో చెప్పారు. అ మాటలే ఇప్పుడు చైనా దాడికి కారణమయ్యాయి.

తైవాన్ తమ దేశంలో భాగమని చెప్తూ వస్తోన్న చైనా.. ఉపాధ్యక్షుడి వ్యాఖ్యలపై మండిపడింది. ఇది పూర్తిగా ఆమెరికా, తైవాన్ అధికారిక డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ కలిసి చేస్తోన్న రెచ్చగొట్టే చర్యేనని బీజింగ్ ఆరోపించింది. ఈ క్రమంలోనే తైవాన్ చుట్టూ సైనిక విన్యాసాలకు పాల్పడింది. సైనిక బోట్లు, విమానాలతో డ్రిల్స్ నిర్వహించింది. దీంతో చైనా మిలిటరీకి చెందిన 42 యుద్ద విమానాలు తమ ఎయిర్ ఢిపెన్స్ జోన్ లోకి చొచ్చుకువచ్చినట్టు తైవాన్ రక్షణ శాఖ చెప్పుకొచ్చుంది. చైనా సైన్యం నుంచి వచ్చే ముప్పును ఎదుర్కొనేందుకు, స్వతంత్రతను కాపాడుకునేందుకు సిద్ధంగా ఉన్నామని, తమ బలగాలను కూడా మోహరించామని స్పష్టం చేసింది.