
కరోనా వైరస్ వ్యాప్తికి కారణమైన చైనాలోని వుహాన్‌లో పరిస్థితులు కంట్రోల్ లోకి వచ్చాయి. కరోనా పాజిటివ్ కేసులు పూర్తిగా నియంత్రణలోకి రావడంతో అక్కడ లాక్‌డౌన్ ఎత్తివేస్తున్నట్లు చైనా ప్రభుత్వం ప్రకటించింది. వుహాన్ లోనే మొదట కరోనా వైరస్ వ్యాపించింది. కోటి 60 లక్షల జనాభా ఉండే ఈ నగరంలో …జనవరి 23న చైనా ప్రభుత్వం అక్కడ లాక్‌డౌన్ విధించింది. ఆ తర్వాత హుబే ప్రావిన్స్ మొత్తాన్నీ లాక్ డౌన్ విధించింది. ఎట్టకేలకు 76 రోజుల తర్వాత లాక్‌డౌన్ ఎత్తివేశారు. ఇప్పుడు వుహాన్ ప్రజలు ఇక స్వేచ్ఛగా తిరిగేయొచ్చు. చైనాలో నిన్న(మంగళవారం) కొత్తగా 62 కేసులు నమోదుకాగా… ఇద్దరు చనిపోయినట్లు చైనా నేషనల్ హెల్త్ కమిషన్ ప్రకటించింది.