చైనా మార్స్ ప్రోబ్ ప్రయోగం సక్సెస్

చైనా మార్స్ ప్రోబ్ ప్రయోగం సక్సెస్

ఏడు నెలల తర్వాత అంగారకుడిని చేరుకోనున్న స్పేస్ క్రాఫ్ట్
రోవర్ ను అంగారకుడిపై దింపనున్న సీఎన్ఎస్ఏ

బీజింగ్: చైనా తన మొదటి మార్స్ ప్రోబ్ ను సక్సెస్ ఫుల్ గా లాంచ్ చేసింది. గురువారం హైనన్ ప్రావిన్స్లోని వెన్ చాంగ్ స్పేస్ క్రాఫ్ట్లాంచ్ సైట్ నుంచి లాంగ్ మార్చ్ 5 రాకెట్ ద్వారా దీన్ని ప్రయోగించారు. మార్స్ ప్రోబ్ ను లాంచ్ చేసిన 36 నిమిషాల్లోనే ఆర్బిటర్, రోవర్ లతోపాటు స్పేస్ క్రాఫ్ట్ ఎర్త్ మార్స్ ట్రాన్స్ ఫర్ ఆర్బిటర్ ను చేరుకుందని చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (సీఎన్ఎస్ఏ) తెలిపింది. మార్స్ ప్రోబ్ కు తియాన్వెన్ 1 గా చైనా పేరు పెట్టింది. అంగారకుడి చుట్టూ తిరుగుతూ అనువైన ప్రదేశంలో రోవర్ ను ల్యాండ్ చేయనుంది. అది ప్లానెట్లో ఉన్న మట్టి, జియోగ్రఫికల్ స్ట్రక్చర్, ఎన్విరాన్ మెంట్, వాతావరణం, నీటిలభ్యత ఇతర అంశాలపై వివరాలు పంపనుంది. మార్స్ ప్రోబ్ గమ్యాన్ని చేరుకునేందుకు ఏడు నెలలు పడుతుందని చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ కార్పొరేషన్ వెల్లడించింది. మార్స్ ప్రోబ్లో ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ ఉన్నాయని, మార్స్ ఆర్బిట్ కు చేరుకోగానే అవి సపరేట్ అవుతాయంది. ఆర్బిటర్ ఆర్బిట్లోనే ఉండి సిగ్నల్స్ చేరవేస్తుంది. రోవర్కు 6 చక్రాలు, 4 సోలార్ ప్యానెళ్లు, 6 సైంటిఫిక్ ఇన్ స్ట్రుమెంట్స్ ఉన్నాయి. దాని బరువు 200 కిలోలు. 3 నెలల పాటు ప్లానెట్ పై పనిచేస్తుంది. ఈ ప్రయోగంతో మార్స్ మిషన్ను సక్సెస్ ఫుల్ గా ముగించిన ఇండియా, యూఎస్, రష్యా, ఈయూ తర్వాత ఐదో స్థానంలో చైనా నిలవనుంది.

For More News..

గ్రీన్ కార్డ్ వెయిట్ లిస్ట్ 195 ఏండ్లు !

ఇక నుంచి ఆర్మీలో మహిళలకు కీలక బాధ్యతలు