నిజం చెప్పు చైనా.. కరోనాలా ముంచొద్దు : ఇండియా వార్నింగ్

నిజం చెప్పు చైనా.. కరోనాలా ముంచొద్దు : ఇండియా వార్నింగ్

చైనా.. మరోసారి ప్రపంచ దేశాలను భయపెడుతుంది. ముఖ్యంగా పొరుగునే ఉన్న భారత్ వంటి దేశాలు అయితే వణికిపోతున్నాయి. ప్రస్తుతం చైనాలో న్యూమోనియా రకానికి చెందిన అంతుచిక్కని వైరస్ వ్యాప్తి జరుగుతుంది. చైనా రాజధానితోపాటు మరో రెండు నగరాల్లోని చిన్న పిల్లలు అందరూ ఆస్పత్రిపాలు అవుతున్నారు. వైరస్ బారిన పెద్దలు కూడా పడుతున్నారు. ఈ క్రమంలోనే ఇండియా అప్రమత్తం అయ్యింది. చైనాను నిలదీస్తుంది. వైరస్ కు సంబంధించిన అన్ని వివరాలు అందించాలని.. అంతే కాకుండా నిజాలు చెప్పాలని.. నిజాలు దాచి.. కరోనా తరహాలో మోసం చేస్తే.. అబద్దాలు చెబితే మిగతా దేశాలు ఇబ్బందులు పడాల్సి వస్తుందని వార్నింగ్ ఇస్తుంది ఇండియా.

న్యూమోనియాకు చెందిన కొత్త వైరస్ కు సంబంధించిన అన్ని వివరాలు, చికిత్స వివరాలు, వైరస్ వ్యాప్తికి సంబంధించిన సమాచారం అంతా భారత్ కు అందించాలని.. తగు జాగ్రత్తలు తీసుకోవటానికి.. ముందుగా అప్రమత్తం కావటానికి అవకాశం ఉందని చెబుతూ.. చైనా ఆరోగ్య శాఖను కోరారు ఇండియా కోవిడ్ ప్యానెల్ చీఫ్ డాక్టర్ అరోరా. 

2019లోనూ ఇదే తరహాలో వుహాన్ లో వైరస్ వ్యాప్తి జరిగిందని.. ఆ తర్వాత అది కరోనాగా మారిందని.. ప్రపంచానికి ఉపదృవం తీసుకొచ్చిందని వెల్లడించారు డాక్టర్ అరోరా. ఇప్పుడు కూడా అలాంటి తరహాలోనే చిన్న పిల్లలకు వైరస్ వ్యాప్తి జరుగుతుందనే అనుమానాలు ఉన్నాయని.. అందుకే చైనాను గట్టిగా కోరుతున్నట్లు వివరించారాయన. 

రెండు అంశాలపై చైనా ఆరోగ్య శాఖను.. చైనా దేశాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నట్లు వెల్లడించారు డాక్టర్ అరోరా. అందులో ఒకటి వైరస్ పరీక్షల వివరాలు, చికిత్స, వ్యాప్తి అంశాలకు సంబంధించిన పూర్తి రిపోర్ట్ ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఇవ్వాలని కోరారు. అదే విధంగా వైరస్ వ్యాప్తికి కారణాలు ఏంటీ.. ఎందుకు వస్తుంది.. ఏయే వయస్సు వాళ్లకు వస్తుంది.. తీసుకుంటున్న జాగ్రత్తలు ఏంటీ.. ఇప్పటికే ఈ వైరస్ వ్యాప్తి విషయంలో అనుసరించిన విధానాలు ఏంటీ అనే రెండు అంశాలపై చైనాను ఒత్తిడి చేస్తున్నట్లు వివరించారు డాక్టర్ అరోరా. 

దీనిపై చైనా ఆరోగ్య శాఖ ఎలా స్పందిస్తుంది అనేది వేచి చూడాలి. గతంలోనూ కరోనా విషయంలో చివరి వరకు రహస్యంగా ఉంచి.. ప్రపంచాన్ని నాశనం చేసిందనే విమర్శలు, ఆరోపనలు ఉన్నాయి.