మసూద్ పై మారని చైనా

మసూద్ పై మారని చైనా

జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ విషయంలో చైనా ‘కర్ర విరక్కుండా.. పాము చావకుండా’ అన్న సామెతను గుర్తుకుతెచ్చేలా వ్యవహరిస్తోంది. మసూద్ ను ఇంటర్నేషనల్‌ టెర్రరిస్టుగా ప్రకటించాలన్న డిమాండ్ పై క్లారిటీ ఇవ్వడంలేదు. అయితే చర్చల ద్వారా మాత్రమే సమస్యను పరిష్కంచుకోవాలంటూ చేతులు దులుపుకుంటోంది.

మసూద్ ను ఇంటర్నేషనల్‌ టెర్రరిస్టుగా ప్రకటించాలన్న విషయంలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో తీర్మానం ప్రవేశపెట్టాయి. ఇది ఈనెల 13న యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ముందుకు వచ్చే అవకాశం ఉంది. మసూద్ పై ప్రవేశపెట్టిన తీర్మానాన్ని చైనా ఇప్పటిదాకా మూడు సార్లు సెక్యూరిటీ కౌన్సిల్ లో తన వీటో పవర్‌ ద్వారా అడ్డుకుంది. పుల్వామా టెర్రర్ అటాక్ తర్వాత ఇండియా, పాక్ మధ్య టెన్షన్లు పెరిగిపోయాయని అంగీకరిస్తూనే.. తగ్గించేందుకు చర్చలే మార్గమని సూచించింది. మసూద్‌ అంశంపై సెక్యూరిటీ కౌన్సిల్ లో రెస్పాన్సిబుల్ గా వ్యవహరిస్తామని చైనా అధికార ప్రతినిధి కాంగ్ చెప్పారు.