డ్రైవింగ్ చేసేటప్పుడు మత్తొస్తే ఎంత ప్రమాదం! గాడీ గాడి తప్పిపోయి ప్రాణాలు గాల్లో కలిసిపోయే ముప్పు రావొచ్చు. అదే విమానంలో అయితే ఓ పైలెట్ హాయిగా కునుకు తీస్తే.. అందులోని వందలాది మందిని ప్రమాదంలోకి నెట్టేసినట్టే కదా. చైనా ఎయిర్లైన్స్ పైలెట్ అదే చేశాడు. విమానం గాల్లోకి లేచాక కునుకు తీశాడు. అతడి నిద్రను కో పైలెట్ వీడియో తీశాడు. దీంతో ఆ పైలెట్ ను సస్పెండ్ చేసింది చైనా. అంతేకాదు.. కోపైలెట్ పైనా సస్పె న్షన్ వేటు వేసింది. ఎందుకో తెలుసా.. నిద్రపోతున్నోడిని లేపకుండా వీడియో తీసినందుకు. నిద్ర పోయిన ఆ పైలెట్ కు 20 ఏళ్ల అనుభవం ఉందట. వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు పైలెట్ తీరుపై మండిపడ్డారు.
