బార్డర్​ వెంట.. 400 గ్రామాల నిర్మాణానికి చైనా ప్లాన్

బార్డర్​ వెంట.. 400 గ్రామాల నిర్మాణానికి చైనా ప్లాన్
  • ఎల్ఏసీకి దగ్గర్లో ఇప్పటికే 250 ఇండ్లతో ఊర్లు
  •  పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న ఇండియన్ ఆర్మీ

న్యూఢిల్లీ: చైనా పన్నిన మరో పన్నాగం బయటపడింది. మనదేశ బార్డర్​కు ఆనుకుని ఏకంగా 400 గ్రామాలను నిర్మించేందుకు ప్లాన్ చేసినట్లు తేలింది. ఉత్తరాఖండ్​లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్ఏసీ)కి 11 కి.మీ. దూరంలో 250 ఇండ్లతో కూడిన బార్డర్ సెక్యూరిటీ విలేజ్​ను చైనా ఇదివరకే నిర్మించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఎల్ఏసీకి 35 కిలోమీటర్ల దూరంలో ఇంకో 56  ఇండ్లను నిర్మిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అలా ఉత్తరాఖండ్​తో 350 కిలోమీటర్ల మేర ఉన్న బార్డర్​ వెంబడి చైనా 400 ఇండ్లను నిర్మించాలని స్కెచ్ వేసిందని చెప్పాయి. ఇదంతా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) పర్యవేక్షణలోనే జరుగుతోందని ప్రకటించాయి.

కొత్తగా నిర్మిస్తున్న గ్రామాల్లో అన్ని రకాల సౌలత్​లతోపాటు పెద్ద పెద్ద మార్కెట్లు ఉన్నాయని వెల్లడించాయి. ఎల్ఏసీ వెంబడి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు ఇండియన్ ఆర్మీ ఇదివరకే స్పష్టం చేసింది.