మసూద్ విషయంలో చైనా సానుకూల స్పందన

మసూద్ విషయంలో చైనా సానుకూల స్పందన

జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజార్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేందుకు అడ్డంకులు తొలగిపోతున్నట్టుగా కనిపిస్తోంది. రాజకీయ సంప్రదింపుల ద్వారానే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చైనా కామెంట్ చేసింది. మసూద్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే అంశంలో సానుకూల ప్రగతి ఉందని  చైనా విదేశాంగ మంత్రి జీయింగ్ షువాంగ్ చెప్పారు. గతంలో నాలుగు సార్లు అడ్డుచెప్పిన చైనా.. ఇప్పుడు వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.