చైనాలో కొత్తగా 21 కరోనా పాజిటివ్ కేసులు

చైనాలో కొత్తగా 21 కరోనా పాజిటివ్ కేసులు
  • లక్షణాలు లేకుండా 13 మందికి కరోనా
  • వూహాన్‌లో మాస్‌ టెస్టింగ్

బీజింగ్‌: చైనాలో కొత్తగా 21 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని చైనా నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ (ఎన్‌హెచ్‌సీ) ప్రకటించింది. వారిలో 13 మందికి ఎలాంటి లక్షణాలు లేకుండానే కరోనా పాజిటివ్‌ వచ్చిందని అధికారులు చెప్పారు. దీంతో చైనాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 82,941కి చేరింది. వైరస్‌ బారినపడి 4633 మంది చనిపోయారు. దీంతో వూహాన్‌లో రెండోసారి వైరస్‌ విజృంభించే అవకాశం ఉండటంతో అక్కడ నివసిస్తున్న 1.10కోట్ల మందికి వైరస్‌ మాస్‌ టెస్టింగ్‌ చేయాలని అధికారులు డిసైడ్‌ చేశారు. వైరస్‌ సామాజిక వ్యాప్తి చెందుతోందని జిలిన్‌ వైస్‌ మేరయ్‌ గాయ్‌ డాంగ్‌పింగ్‌ చెప్పారు. వైరస్‌ పాజిటివ్‌ వచ్చిన వారితో కాంటాక్ట్‌ అయిన 283405 మందిని గుర్తించామని, వారిలో 763 మంది మెడికల్‌ అబ్జర్వేషన్‌లో ఉన్నట్లు ఎన్‌హెచ్‌సీ అధికారులు చెప్పారు.