వూహాన్ లో నెల తర్వాత తొలి కరోనా కేసు

వూహాన్ లో నెల తర్వాత తొలి కరోనా కేసు

బీజింగ్: చైనాలో కరోనా మహమ్మారి మళ్లీ ప్రభావం చూపుతోంది. అయితే మునుపటి అంత కాకుండా కొన్ని కేసులే నమోదవడం గమనార్హం. తమ దేశంలో కొత్తగా 14 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు చైనా నేషనల్ హెల్త్ కమిషన్ పేర్కొంది. ఏప్రిల్ 28 తర్వాత ఇదే అత్యధిక కేసులు సంఖ్యగా తెలిపింది. వైరస్ పుట్టిన వూహాన్ సిటీలో ఒక నెల తర్వాత మొదటి కేసు నమోదైంది. గత గురువారం చైనా తమ దేశంలోని అన్ని ప్రాంతాల్లో వైరస్ ప్రభావం తక్కువగా ఉన్నట్లు ప్రకటించింది. అయితే ఆదివారం ఈశాన్య జిలిన్ ప్రావిన్స్ లోని షులాన్ లో కొత్తగా 11 కేసులు నమోదవడం గమనార్హం. వూహాన్ లో కొత్తగా నమోదైన కేసుకు సంబంధింలో గతంలో ఆ వ్యక్తికి వైరస్ సోకిన లక్షణాలు కనిపించలేదని హెల్త్ కమిషన్ ప్రకారం తెలుస్తోంది. షులాన్, వూహాన్ కేసులను మినహాయిస్తే మిగిలిన రెండు కేసులను ఇంపోర్టెడ్ ఇన్ఫెక్షన్స్ అని.. చైనాలో కొత్తగా మరణాలు నమోదు కాలేదని చెప్తున్నారు.