ఘోర రోడ్డు ప్రమాదం.. 36 మంది మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. 36 మంది మృతి

చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు  ట్రక్ ను ఢీ కొట్టడంతో 36 మంది మృతి చెందారు.  మరో 36 మందికి గాయాలయ్యాయి. ఇందులో తొమ్మిది మంది పరిస్థితి మరింత విషమంగా ఉంది. శనివారం తూర్పు జియాంగ్సు ప్రావిన్స్‌లోని ఎక్స్‌ప్రెస్‌వేపై ఈ ఘటన జరిగింది.  బస్సు ఎడమ టైర్ లో గాలి తక్కువవడంతో  ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ప్రమాద సమయంలో బస్సులో 69 మంది ఉన్నారు. ఈ ప్రమాదంతో రోడ్డుపై 8 గంటల పాటు ట్రాఫిక్ జామ్ అయ్యింది.  చైనాలో ఘోరమైన రోడ్డు ప్రమాదాలు సర్వసాధారణం.  అధికారుల  లెక్కల ప్రకారం 2015 లో  దేశవ్యాప్తంగా 58,000 మంది అక్కడి రోడ్డు ప్రమాదాల్లో మరణించారు.