పాక్ ఉగ్రవాదాన్ని వీడాల్సిందే: చైనా,రష్యా వార్నింగ్

పాక్ ఉగ్రవాదాన్ని వీడాల్సిందే: చైనా,రష్యా వార్నింగ్

ఉగ్రవాదం ప్రపంచానికి పెనుముప్పుగా మారిందన్నారు విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్. పాకిస్తాన్ కేంద్రంగా జరుగుతున్న ఉగ్రవాద చర్యలతో భారత్ తీవ్రంగా నష్ట పోతుందన్నారు. పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు చనిపోయారన్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా నాన్ మిలిటరీ ఆపరేషన్ తో ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేశామన్నారు. సరిహద్దులో శాంతియుత పరిస్థితుల కోసమే బారత్ పనిచేస్తుందన్నారు. చైనాలో పర్యటిస్తున్న సుష్మ.. రష్యా, చైనా విదేశాంగశాఖ మంత్రుల 16వ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైనాతోపాటు రష్యా పాకిస్తాన్ కు వ్యతిరేకంగా గట్టి వార్నింగ్‌ ఇచ్చాయి. ఉగ్రవాదాన్ని పాక్ వీడాల్సిందేనని స్పష్టం చేస్తూ భారత్‌, రష్యా, చైనా సంయుక్త ప్రకటన చేశాయి.