ఇండియా విద్యార్ధులపై చైనా ఆంక్షలు

ఇండియా విద్యార్ధులపై చైనా ఆంక్షలు

కరోనా…చైనాలో పుట్టుకొచ్చిన ఈ వైరస్  ప్రపంచ వ్యాప్తంగా కలవరపెడుతోంది.ఈ వైరస్ తో ప్రపంచ దేశాలు అలర్టయ్యాయి. ఏ మాత్రం వ్యాధి లక్షణాలు కన్పించినా వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు డాక్టర్లు. ఇందులో భాగంగానే  చైనాలోని వివిధ ప్రాంతాల్లో మెడిసిన్ చదువుతున్న భారత విద్యార్థులపై ఆ దేశ ప్రభుత్వం కఠిన ఆంక్షలను విధించింది. ఇప్పటికిప్పుడు ఎవరూ ఇండియాకు వెళ్లడానికి వీల్లేదని ఆదేశించింది. కరోనా వైరస్‌ పూర్తిగా తగ్గిన తర్వాతనే విద్యార్థులు ఇండియా వెళ్లేందుకు అనుమతినిస్తామని అధికారులు తేల్చి చెప్పారు. కరోనా వైరస్ ఇతర దేశాలకు వెళ్లకుండా చూసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

చైనా నిర్ణయంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే భారత అధికారులు భరోసా ఇస్తున్నారు. చైనాలో వేలాది మంది విద్యార్థులు వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. కొందరు వైరస్ వెలుగులోకి వచ్చిన వుహాన్ లోనూ ఉన్నారు. వీరంతా కరోనా వైరస్ తగ్గిన తర్వాతనే ఇండియాకు వచ్చే అవకాశం ఉంది.