సొంత స్పేస్‌‌‌‌ స్టేషన్‌‌‌‌లోకి ఆస్ట్రొనాట్లను పంపిన చైనా

సొంత స్పేస్‌‌‌‌ స్టేషన్‌‌‌‌లోకి ఆస్ట్రొనాట్లను పంపిన చైనా
  • సొంత స్పేస్‌‌‌‌ స్టేషన్‌‌‌‌లోకి ముగ్గురు చైనా ఆస్ట్రొనాట్లు
  • షెంజూ 12 స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పంపిన డ్రాగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంట్రీ
  • అంతరిక్షంలోని తియాన్హే మాడ్యూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అటాచైన షెంజూ
  • 3 నెలల పాటు చైనా స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పనులు

న్యూఢిల్లీ: అంతరిక్ష ప్రయోగాల్లో చైనా మరో రికార్డు సృష్టించింది. తమ దేశానికి చెందిన వ్యోమగాములను ఐదేళ్ల తర్వాత మరోసారి విజయవంతంగా స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి పంపింది. గురువారం పొద్దున 9.22 గంటలకు (మన దగ్గర పొద్దున 7 గంటలకు) గోబీ ఎడారిలోని జియుక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి ‘షెంజూ 12’ స్పేష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో లాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్చ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాకెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నింగిలోకి వెళ్లింది. అప్పటికే అక్కడ ఉన్న చైనా స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాడ్యూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తియాన్హేకు ముగ్గురు ఆస్ట్రొనాట్లు ఉన్న మాడ్యూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అటాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయింది. ఈ మొత్తం ప్రాసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంతా పూర్తవడానికి 6.5 గంటలు పట్టింది. ముగ్గురు ఆస్ట్రొనాట్లు నీ హైషెంగ్, లీయూ బోమింగ్, టాంగ్ హోంగ్బో మూడు నెలల పాటు అంతరిక్షంలోనే గడపనున్నారు. కొత్త అంతరిక్ష కేంద్రం నిర్మాణ పనులు కొనసాగించనున్నారు. స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(తియాన్​గాంగ్​)ను వచ్చే ఏడాదికల్లా రెడీ చేయాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. 

కమ్యూనిస్టు పార్టీ వందేళ్ల వేడుకలున్నాయని?
చైనా నిర్వహిస్తున్న అత్యంత సుదీర్ఘ అంతరిక్ష మిషన్ షెంజూ 12. ఆ దేశం చేపట్టిన మానవ సహిత 7వ మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. చైనా కోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రస్తుతం తియాన్హే మాడ్యూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షెంజో 12, కార్గో క్రాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తియాంజు 2 ఉన్నాయి. వచ్చే నెలలో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైనా(సీపీసీ) వందేళ్ల వేడుకలు జరగనున్న టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఈ స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేపట్టారు. కమ్యూనిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్టీ పాలనలో చైనా ఇలాంటి ఘనతలెన్నో సాధించిందని తెలియజెప్పడానికి ఈ కార్యక్రమం చేపట్టిందని అనుకుంటున్నారు.  ప్రస్తుతమున్న ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెండు భాగాలుగా ఉంది. రష్యన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్బిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రష్యా, అమెరికా ఆర్బిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అమెరికా సహా మరిన్ని దేశాలు నడిపిస్తున్నాయి. దీంతో సంబంధం లేకుండా చైనా సొంత స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేషన్​ను ఏర్పాటు చేసుకుంటోంది. 

స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎట్లుంటది?
చైనా స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూమికి 340 నుంచి 450 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పదేళ్ల పాటు పని చేస్తుంది. టి ఆకారంలో ఉండే ఈ స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మధ్యలో ఒక కోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాడ్యూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, దానికి రెండు వైపులా ల్యాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యాప్సూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉంటాయి. స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ప్రతి క్యాప్సుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బరువు దాదాపు 20 టన్నులు ఉంటుంది. స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మొత్తం బరువు 66 టన్నుల దాకా ఉంటుందని అంచనా వేశారు.

రోబోటిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయి..
మరోవైపు చైనా స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రోబోటిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయి ఏర్పాటు చేయనున్నారు. ఆ చేయి విషయమై అమెరికా అడ్డుచెప్పింది. అదో మిలటరీ అప్లికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అని ఆరోపించింది. 15 మీటర్ల దాకా పెరిగే ఆ చేయి.. చైనా స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్మా ణంలో కీలకం కానుంది. స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్మాణానికి సంబంధించి చైనా మరిన్ని స్పేష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిషన్లను కూడా లాంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయనుంది. గత 6 నెలల్లో చంద్రుడి ఉపరితలం నుంచి రాళ్లు, మట్టి నమూనాలను భూమికి తీసుకొచ్చిన డ్రాగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంట్రీ.. అంగారకుడిపై 6 చక్రాల రోవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కూడా ల్యాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసింది.