వ్యాక్సినేషన్ లో చైనా ఫస్ట్.. మూడో స్థానంలో భారత్

వ్యాక్సినేషన్ లో చైనా ఫస్ట్.. మూడో స్థానంలో భారత్

న్యూఢిల్లీ: కరోనాను ఎదుర్కోవడంలో కీలకమైన వ్యాకినేషన్ ప్రక్రియలో చైనా ఇతర దేశాల కంటే ముందంజలో ఉంది. ఈ వైరస్ పుట్టుకకు కారణంగా అనుమానిస్తున్న డ్రాగన్ కంట్రీ.. 30 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ ఇవ్వడం గమనార్హం. వ్యాక్సినేషన్ విషయంలో చైనా తర్వాత రెండో స్థానంలో అగ్రరాజ్యం అమెరికా నిలిచింది. ఇక మూడో స్థానంలో భారత్ ఉంది. అమెరికాలో 26 కోట్ల మందికి వ్యాక్సిన్ వేయగా, భారత్ లో ఆ సంఖ్య 18 కోట్లుగా ఉంది. ఇండియా తర్వాతి స్థానాల్లో యూకే, బ్రెజిల్, జర్మనీ, ఫ్రాన్స్, టర్కీ నిలిచాయి. ఈ విషయాలను నీతి ఆయోగ్ (హెల్త్) మెంబర్, వికే పాల్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. 

ఇకపోతే, కొవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య 12 నుంచి 16 వారాలకు పెంచాలని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ (NTAGI) సూచనలు చేసింది. ఇంతకుముందు ఈ వ్యత్యాసం 6 నుంచి 8 వారాలకు ఉండేది. కాగా, కొవ్యాకిన్ డోసుల విషయంలో మాత్రం NTAGI ఎలాంటి సూచనలు చేయలేదు.