
- అరుణాచల్ తమదేనని కామెంట్స్
- అది ఇండియాదేనని అమెరికా వెల్లడి
బీజింగ్ : అరుణాచల్‌ప్రదేశ్ లోని 11 ప్రాంతాలకు ఇటీవల కొత్త పేర్లు పెట్టిన చైనా.. ఇప్పుడు మరింత బరి తెగించింది. ఆ రాష్ట్రం భారత్‌కు చెందిందేనని తెలిసినా.. దానిపై తమకు సార్వభౌమాధికారం ఉందని మరోసారి ప్రకటించుకుంది. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ మంగళవారం ఒక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. ‘‘జాంగ్నన్(అరుణాచల్‌ప్రదేశ్) అనేది చైనాలో అంతర్భాగం”అంటూ వివాదాస్పద కామెంట్చేశారు.‘‘జాంగ్నన్ (అరుణాచల్)లోని కొన్ని ప్రాంతాలకు చైనా ప్రభుత్వంలోని సంబంధిత విభాగాలు ఇటీవల కొత్త పేర్లు పెట్టాయి. అరుణాచల్ అనేది చైనా సార్వభౌమత్వ హక్కు పరిధిలోనే ఉంది”అని ఆమె పేర్కొన్నారు.
మరోవైపు ఈ పరిణామాలపై అమెరికా స్పందించింది. అరుణాచల్‌ప్రదేశ్‌ను భారత్‌లో అంతర్భాగంగానే తాము గుర్తించామని స్పష్టం చేసింది. చైనా ఏకపక్షంగా అరుణాచల్‌లోని ప్రాంతాలకు కొత్త పేర్లు పెడుతూ, అవి తమవేనని ప్రకటించుకోవడాన్ని వైట్ హౌస్ ప్రెస్‌సెక్రటరీ కెరీన్ జీన్ పియెరీ తీవ్రంగా ఖండించారు. ఈవిషయంలో భారత్‌కు మద్దతుగా ఉంటామన్నారు.