చైనాలో మళ్లీ కరోనా: జిలిన్ ప్రావిన్స్ లో లాక్ డౌన్

చైనాలో మళ్లీ కరోనా: జిలిన్ ప్రావిన్స్ లో లాక్ డౌన్

చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ప్రాణాంతక కరోనా వైరస్ అత్యంత వేగంగా ప్రపంచ దేశాలకు వ్యాపించింది. ఇతర దేశాలన్నీ కరోనాతో వణికిపోతున్న సమయంలో చైనాలో కరోనా వైరస్ వ్యాప్తి కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. అయితే అది తాత్కాలికమేనని తేలింది. మళ్లీ అక్కడ కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత కొన్నిరోజులుగా చైనాలో మళ్లీ కరోనా కలకలం మొదలైంది. వుహాన్ లోనూ కరోనా క్లస్టర్లు బయటపడుతున్నాయి. లేటెస్టుగా  జిలిన్ ప్రావిన్స్ లో 34 మందికి కరోనా నిర్ధారణ కావడంతో అధికారులు అలర్టయ్యారు. దాంతో ఆ ప్రావిన్స్ లో లాక్ డౌన్ విధించారు. రవాణా వ్యవస్థ నిలిపివేశారు. స్కూళ్లు, ఆఫీసులు మూతపడ్డాయి. రష్యా నుంచి వచ్చిన వారి కారణంగానే కరోనా కేసులు వస్తున్నాయంటున్నారు అధికారులు.