కరోనాపై నిజాలు బయటపెట్టిన జర్నలిస్ట్‌ పరిస్థితి విషమం

కరోనాపై నిజాలు బయటపెట్టిన జర్నలిస్ట్‌ పరిస్థితి విషమం

బీజింగ్: వుహాన్ లో కరోనా మహమ్మారి మొదలైన సమయంలో ప్రభుత్వ నిర్వాకాలను ఎండగట్టిన ఓ సిటిజన్ జర్నలిస్ట్ ఇప్పుడు చావుకు దగ్గరవుతోంది. నిరుడు ఫిబ్రవరిలో వుహాన్ నుంచి స్మార్ట్ ఫోన్ తో వీడియోలు తీసి ప్రసారం చేసిన జర్నలిస్ట్, లాయర్ ఝాంగ్ ఝాన్(38)ను మే నెలలో చైనా అధికారులు అరెస్ట్ చేశారు. ‘గొడవలను రెచ్చగొట్టి, సమస్యలను సృష్టించేందుకు’ చూసిందంటూ ఆమెకు నాలుగేండ్ల జైలు శిక్ష విధించారు. అన్యాయంగా తనను శిక్షించడాన్ని వ్యతిరేకిస్తూ ఆమె నిరాహారదీక్ష చేపట్టారు. ఝాంగ్ ఝాన్ జైలులో నిరాహార దీక్ష కొనసాగిస్తోందని, ఆమె ఆరోగ్యం క్షీణించిందని, ఇంకెన్నో రోజులు బతకకపోవచ్చని ఆమె సోదరుడు ఝాంగ్ జూ ఇటీవల ట్వీట్ చేయడంతో విషయం వైరల్ అయింది. దీంతో ఝాంగ్​ను విడుదల చేసేలా ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ చైనా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలంటూ మానవ హక్కుల సంఘాల కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.