మరీ విడ్డూరం : ఎండలకు తట్టుకోలేక.. ఫ్రిడ్జ్ లో కూర్చుకున్నాడు..

మరీ విడ్డూరం : ఎండలకు తట్టుకోలేక.. ఫ్రిడ్జ్ లో కూర్చుకున్నాడు..

రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న రిత్యా ఆ వేడిమిని తట్టుకునేందుకు చాలా మంది అనేక ప్రత్నామ్యాయ మార్గాల కోసం ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా చైనాలోని గ్వాంగ్‌డాంగ్‌కు చెందిన ఒక వ్యక్తి ఫ్రిడ్జ్ లో కూర్చోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఫోన్‌ను ఉపయోగిస్తూ ఫ్రిడ్జ్ లో కూర్చున్న యువకుడికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎనిమిది సెకన్ల ఈ వీడియోలో ఓ యువకుడు రిఫ్రిజిరేటర్‌లోని ఖాళీ ప్రదేశంలో పింక్ స్టూల్‌పై కూర్చొని ఉన్నాడు. అతని ప్రక్కనే ఇతర పానీయాలు నిల్వ చేయబడి ఉన్నాయి. ఇక అందరి దృష్టీ ఆ వ్యక్తి తన చేతిలో పట్టుకున్న ఫోన్‌పై ఉంది.

ఈ వీడియోలో యువకుడు ప్రశాంతంగా ఫ్రిడ్జ్ లో కూర్చుని, వీడియో తీస్తున్న వారి వైపు చూస్తాడు. ఆ తర్వాత అతను తన కాలును ఉపయోగించి ఫ్రిడ్జ్ తలుపును కొద్దిగా తెరుస్తాడు. ఈ వీడియోపై నెటిజన్లు కూడా భిన్నంగా కామెంట్ చేస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతలను ఎదుర్కోవడానికి, గ్వాంగ్‌డాంగ్‌లోని నివాసితులు ఐస్ ప్యాక్‌లను ఉపయోగించడం లేదా చల్లబడిన పుచ్చకాయ రసం లేదా హౌథ్రోన్ ఐస్‌డ్ టీ వంటి రిఫ్రెష్ పానీయాలను తీసుకోవడం వంటి వివిధ శీతలీకరణ పద్ధతులను ఉపయోగించాలని పలువురు సూచించారు.

చైనాలోని గ్వాంగ్‌డాంగ్‌లో మండుతున్న వాతావరణం కారణంగా ఆ వ్యక్తి ఫ్రిడ్జ్ లో ఆశ్రయం పొందాడని కొందరు భావిస్తున్నారు. ఈ సంఘటన జరిగిన రోజున ఝాంగ్‌షాన్‌లో ఉష్ణోగ్రతలు 37.9° Cకి పెరిగాయి. గ్వాంగ్‌డాంగ్‌లోని అనేక నగరాల్లో 37 °C కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడం గమనార్హం.