ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న రాజకీయ ప్రస్థానం ఇదే..

ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న రాజకీయ ప్రస్థానం ఇదే..

ఆంధ్రప్రదేశ్ కొత్త స్పీకర్ గా సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రొటెం స్పీకర్ గొరంట్ల బుచ్చయ్య చౌదరి ఈ ప్రకటన చేశారు. నూతనస్పీకర్ గా ఎన్నికైన అయ్యన్నపాత్రుడిని  సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , మంత్రులు అచ్చెన్నాయుడు, సత్యకుమార్ స్పీకర్ చైర్ వద్దకు తీసుకెళ్లి సభాపతి స్థానంలో కూర్చోబెట్టారు. 

చింతకాయల అయ్యన్నపాత్రుడు..టీడీపీలో సీనియర్ నేతగా ఉన్నారు. ఎన్టీఆర్ కేబినెట్ లోనూ మంత్రిగా పనిచేశారు. ఇటీవల ఎన్నికల్లో అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఇప్పటివరకు ఏడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు అయన్నపాత్రుడు. అయ్యన్నపాత్రుడు 1982లో టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ఉన్నారు. 1983, 1985, 1994, 1999, 2004, 2014, 2024లో ఎమ్మెల్యేగా గెలుపొందారు.

 అలాగే 1996లో అనకాపల్లి నుంచి టీడీపీ ఎంపీగా గెలిచారు. అయ్యన్న...ఎన్టీఆర్‌, చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. ఈసారి కూడా చంద్రబాబు కేబినెట్ స్థానం దక్కుతుందని భావించిన... యువతకు ప్రాధాన్యత ఇవ్వడంతో మంత్రి పదవి దక్కలేదు. అయితే ఆయనకు స్పీకర్ పదవిని ఖరారు చేశారు. దీంతో ఆయన శుక్రవారం నామినేషన్ వేయగా.. ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఇవాళ… స్పీకర్ గా బాధ్యతలు స్వీకరించారు.