
వరుసగా కురుస్తున్న వర్షాలతో ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం చింతల మాదర జలపాతం, కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం రాయికల్ జలపాతం దుంకుతున్నా యి. చుట్టూ పచ్చని అందాలు, ఎత్తైన కొండల మధ్య నుంచి జాలువారే నీటి ప్రవాహాలు కనువిందు చేస్తుండగా.. పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. జలపాతాల అందాలను చూసేందు కు వివిధ ప్రాంతాల నుంచి పర్యాట కులు తరలివస్తున్నారు. దీంతో టూరిస్టుల సందడి కనిపిస్తోంది. నీటిలో తడుస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. - తిర్యాణి , హుజూరాబాద్, వెలుగు