సంక్రాంతికి హిందీలో రిలీజ్ అవుతున్న ఆచార్య.. అవసరమా అంటున్న మెగా ఫ్యాన్స్

సంక్రాంతికి హిందీలో రిలీజ్ అవుతున్న ఆచార్య.. అవసరమా అంటున్న మెగా ఫ్యాన్స్

ఆచార్య(Acharya) సినిమా మెగాస్టార్(Megastar) ఫ్యాన్స్ కి పెద్ద పీడకల. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ(Koratala Shiva) దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా చిరు కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాట్సర్ గా నిలిచింది. అంతేకాదు ఈ సినిమాలో ప్రత్యేకమైన రోల్ లో రామ్ చరణ్ కూడా చేయడంతో ఆచార్య సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలను అందుకోవడంలో ఫెయిల్ అయ్యింది ఆచార్య మూవీ. 

అంతేకాదు.. ఈ సినిమాపై దారుణంగా ట్రోల్స్ జరిగాయి. చిరంజీవిని, దర్శకుడు కొరటాల శివను ఓ ఆట ఆడేసుకున్నారు నెటిజన్స్. సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నాం అని, ఓ మోస్తరుగా లేదని ఓపెన్ గానే కామెంట్స్ చేశారు. దీంతో దర్శకుడు కొరటాల శివ కొంతకాలం మీడియాకి దూరంగా ఉండాల్సి వచ్చింది. 

ఇదిలా ఉంటే.. ఈ రేంజ్ లో ట్రోల్ అయినా ఆచార్య సినిమా బాలీవుడ్ లో రిలీజ్ కాబోతుందట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే థియేటర్స్ లో కాకుండా కేవలం యూట్యూబ్ లో రిలీజ్ చేస్తున్నారట. సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజ్ కానుంది ఈ సినిమా. భారీ భారీ సినిమాలను రిలీజ్ చేసిన పెన్ మూవీస్ లో ఆచార్య సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఇందులో భాగంగా ఆచార్య హిందీ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. దీంతో మెగా ఫ్యాన్స్ కాస్త ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే తెలుగులో చెత్త రికార్డు సాధించిన ఈ మూవీని.. ఇప్పుడు హిందీలో రిలీజ్ చేయడం అవసరమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి తెలుగులో భారీ డిజాస్టర్ గా నిలిచిన ఆచార్య మూవీ హిందీ వర్షన్ లో ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి.