కల్కి కోసం చిరు సెంటిమెంట్.. వర్కౌట్ అవుతుందా?

కల్కి కోసం చిరు సెంటిమెంట్.. వర్కౌట్ అవుతుందా?

సలార్(Salaar) మ్యానియా ముగిసింది. ఇపుడు ప్రభాస్(Prabhas) ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న మూవీ కల్కి 2898 AD(kalki 2898 AD). మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్(Nag Ashwin) తెరకెక్కిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ అండ్ యాక్షన్ మూవీపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. హాలీవుడ్ రేంజ్ లో తెరెకెక్కుతున్న ఈ సినిమా కోసం ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ ఐనా క్షణాల్లో వైరల్ అవుతోంది. 

తాజాగా కల్కి సినిమా గురించి మరో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే.. ఈ సినిమా కోసం మెగాస్టార్ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారట మేకర్స్. వైజయంతి మూవీస్ బ్యానర్ పై చిరంజీవి హీరోగా వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 1990లో వచ్చిన ఈ సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు అదే బ్యానర్ నుండి వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ కల్కి 2898 AD. అందుకే ఆ బ్యానర్ కు ప్రత్యేకమైన రోజునే 2024 మే9న  ప్రభాస్ కల్కి ని కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇదే విషయం త్వరలోనే ప్రకటన రానుందని సమాచారం. 

ఇక కల్కి సినిమా విషయానికి వస్తే.. ఇండియాస్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీగా వస్తున్న ఈ సినిమాలో లోకనాయకుడు కమల్ హాసన్ విలన్ పాత్రలో కనిపిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ అమితాబ్ కీ రోల్ చేస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ జోడీగా దీపికా పదుకునే నటిస్తున్నారు.
సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. మరి మెగాస్టార్ సెంటిమెంట్ తో వస్తున్న ఈ సినిమా ఆ సినిమాలాగే భారీ విజయాన్ని అందుకుంటుందా అనేది చూడాలి.