వాల్తేరు వీరయ్య లెటెస్ట్ అప్ డేట్.. స్టైలిష్ లుక్ లో చిరు

వాల్తేరు వీరయ్య లెటెస్ట్ అప్ డేట్.. స్టైలిష్ లుక్ లో చిరు

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'వాల్తేరు వీరయ్య'. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడుతోంది. దీంతో వరుసగా అప్ డేట్స్ ఇస్తూ అటు అభిమానుల్లో ఇటు ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచేస్తున్నారు. తాజాగా దర్శకుడు బాబీ మరో అప్ డేట్ ఇచ్చారు. చిరంజీవి లేటెస్ట్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. స్టన్నింగ్ లుక్ లో కనిపిస్తున్న ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. ‘పోస్టర్‌ శాంపిల్‌ మాత్రమే...ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ మొత్తం థియేటర్లలో పూనకాలు తెప్పించడం పక్కా’ అంటూ డైరెక్టర్‌ బాబీ ట్వీట్‌ చేశారు.  

గాగుల్స్ ధరించి ఉన్న చిరు చుట్టూ.. తుపాకులు ఉన్నాయి. చేతికి బేడీలు ధరించి ఉన్నారు. స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్న చిరును చూసి అభిమానులు ఫుల్ ఖుష్ అయిపోతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. చిరంజీవికి జంటగా శ్రుతిహాసన్‌‌‌‌‌‌‌‌ నటిస్తోన్న ఈ మూవీలో రవితేజ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడు. ఏసీపీ పాత్రలో రవితేజ  కనిపించబోతున్నాడు. రవితేజ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించి టీజర్ ను ఇటీవలే రిలీజ్ చేశారు.