ప్ర‌తి జిల్లాలో చిరంజీవి ఆక్సిజ‌న్ బ్యాంకు

V6 Velugu Posted on May 20, 2021

క‌రోనా సెకండ్ వేవ్ తో వైరస్ కేసులు తీవ్ర స్థాయిలో వ్యాపిస్తున్నాయి. దీంతో ఆక్సిజ‌న్ అంద‌క చనిపోతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. బాధితులకు ఆక్సిజ్ అందించేందుకు ఎంతో మంది ప్రముఖులు ముందుకు వస్తున్నారు.సినీ నటుడు సోనూసూద్ ఏకంగా ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. 

ఇప్పటికే ప్రజాసేవ చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి కూడా కరోనా బాధితులకు అండగా నిలిచేందుకు సిద్ధమయ్యారు. ఏకంగా రాష్ట్రంలోని ప్రతీ జిల్లాలో ఆక్సిజన్ బ్యాంకు ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించి ట్విట్టర్ ద్వారా తెలిపారు. వచ్చే వారంలోనే అవి అందుబాటులోకి వచ్చేలా..పనులను వేగవంతం చేస్తున్నట్లు ట్వీట్ చేశారు.

ర‌క్తం దొరక్క ఏ ఒక్క‌రూ ప్రాణాలు పోకూడ‌ద‌ని 1998లో బ్ల‌డ్ బ్యాంక్ ఏర్పాటు చేశాన‌ని.. ఇప్పుడు ప్ర‌తి జిల్లాలో ఆక్సిజ‌న్ బ్యాంక్ ఏర్పాటు చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు చిరంజీవి.

 

Tagged Chiranjeevi Oxygen Bank, every district, setting up Chiranjeevi

Latest Videos

Subscribe Now

More News