మెగాస్టార్ ముందే చెప్పాడు కానీ పట్టించుకోలేదు పాపం

మెగాస్టార్ ముందే చెప్పాడు కానీ పట్టించుకోలేదు పాపం

సినిమా మేకింగ్ అనేది ఎప్పటికైనా రిస్క్ తో కూడుకున్న వ్యవహారమే. ఎందుకంటే.. ఆడియన్స్ ఎ సినిమాని ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది ఎవరు చెప్పలేరు. కానీ.. సినిమా కోసం మేకర్స్ పడే కష్టంలో మాత్రం ఏ తేడా ఉండదు. ఇండస్ట్రిలో ఏ ప్రొడ్యూసర్ అయినా ప్రేక్షకులకు మంచి సినిమాను అందించాలనే ఉద్దేశంతోనే మొదలుపెడతాడు. కానీ కొన్నిసార్లు ఆ  ప్రయత్నం బెడిసికోటవచ్చు. అందుకే.. సినిమాకి ఎలాంటి రిజల్ట్ వచ్చినా మేకర్స్ సేఫ్ అయ్యేలా ప్లాన్ చేసుకోవాలి. ఎలాంటి ప్లాన్ లేకుండా ఎడాపెడా డబ్బులు పెట్టేసి తీరా సినిమా ఫ్లాప్ అయ్యాక లబోదిబోమంటున్నారు కొంతమంది.

సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఏజెంట్ మేకర్స్ కి ఎదురైంది. అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ మూవీకి మినిమమ్ కలెక్షన్స్ కూడా రాలేదు. దీంతో.. ప్రొడ్యూసర్ కి భారీ నష్టాలు వచ్చాయి. రీసెంట్ గా ఏజెంట్ మూవీ ఫ్లాప్ పై ఒక నోట్ కూడా రిలీజ్ చేశాడు. ఫైల్యూర్ కి కారణం.. సరైన ప్లాన్ లేకపోవడమే అని, బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండా షూటింగ్ కి వెళ్ళడం కూడా మరో కారణం అని చెప్పుకొచ్చాడు.

ఇక ఇదే విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి ముందే చెప్పాడు కదా అని ఆయన గతంలో మాట్లాడిన వీడియొని షేర్ చేస్తున్నారు.  "సినిమా అనేది దర్శకుడి ఆలోచన అయినా దానికి నిర్మాత ఎంతో శ్రమ పడి డబ్బు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి సినిమా విషయంలో నిర్లక్ష్యం అసలు పనికిరాదని అన్నారు. అంతేకాదు సినిమా సెట్స్ లో షూటింగ్ లొకేషన్స్ లో మార్పులు చేర్పులు అనేవి సినిమా రిజల్ట్ ని డిసైడ్ చేస్తాయని.. సెట్స్ మీదకు వెళ్లే ముందే పకడ్బందీగా స్క్రిప్ట్ మొత్తం రాసుకోవాలని అన్నారు. అయితే చిరు మాటలను అప్పుడు ట్రోల్ చేసిన కొందరు ఏజెంట్ విషయంలో జరిగినది చూసి  బాస్ అప్పుడు చెప్పింది ఇదే కదా అని కామెంట్స్ చేస్తున్నారు.