Sasirekha Lyrical: 75 మిలియన్ల వ్యూస్‌తో దుమ్మురేపిన ‘మీసాల పిల్ల’.. ఇక ‘శశిరేఖ’ వంతు.. ఫుల్ సాంగ్ ఎప్పుడంటే?

Sasirekha Lyrical: 75 మిలియన్ల వ్యూస్‌తో దుమ్మురేపిన ‘మీసాల పిల్ల’.. ఇక ‘శశిరేఖ’ వంతు.. ఫుల్ సాంగ్ ఎప్పుడంటే?

చిరంజీవి హీరోగా రూపొందుతున్న ‘మన శంకరవరప్రసాద్‌‌ గారు’ చిత్రం నుంచి సెకండ్ సింగిల్‌‌ రాబోతోంది. ఇప్పటికే విడుదలైన ‘మీసాల పిల్ల’ సాంగ్‌‌ 75 మిలియన్ల+ వ్యూస్‌‌ను సాధించగా.. ఇప్పుడు ‘శశిరేఖ’ (Sasirekha) అనే పాటను విడుదల చేయబోతున్నారు.

భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేసిన మెలోడియస్‌‌ సాంగ్‌‌ ప్రోమోను ఈ నెల 6 విడుదల చేయబోతున్నారు. డిసెంబర్ 8న లిరికల్‌‌ వీడియో రానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్‌‌మెంట్‌‌ పోస్టర్‌‌‌‌లో చిరంజీవి ఎనర్జిటిక్‌‌ డ్యాన్స్‌‌ మూమెంట్స్‌‌లో కనిపిస్తుండగా, స్టైలిష్‌‌ డ్యాన్స్‌‌ పోజ్‌‌లో నయనతార ఇంప్రెస్ చేస్తోంది.

పోర్ట్ బ్యాక్‌‌డ్రాప్‌‌లో ఈ పాటను చిత్రీకరించినట్టు అర్థమవుతోంది. ఫుట్ ట్యాపింగ్ బీట్‌‌తో వస్తున్న ఈ పాట కలర్‌‌‌‌ఫుల్‌‌ ట్రీట్ ఇవ్వబోతోందని పోస్టర్‌‌‌‌ ద్వారా తెలుస్తోంది. భీమ్స్ కంపోజ్ చేసిన ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించారు. వెంకటేష్‌‌ కీలకపాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది.