Peddi Trailer Review: చరణ్.. బుచ్చి.. రెహమాన్.. రఫ్ఫాడించేశారు: ‘పెద్ది’ డైలాగ్ లీక్ చేసిన చిరంజీవి

Peddi Trailer Review: చరణ్.. బుచ్చి.. రెహమాన్.. రఫ్ఫాడించేశారు: ‘పెద్ది’ డైలాగ్ లీక్ చేసిన చిరంజీవి

Peddi Chiru Leaks: మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన ‘చిరు లీక్స్’తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. మే 18న విడుదల కానున్న ‘పెద్ది’ ట్రైలర్ని స్పెషల్గా చూసిన చిరు, X వేదికగా క్రేజీ పోస్ట్ పెట్టాడు. పెద్ది ఎలా ఉండబోతుందో పోస్ట్ చేస్తూ అభిమానుల ఎదురుచూపులని రెట్టింపు చేశాడు. ఇది సాధారణ ట్రైలర్ కాదని, ‘3 నిమిషాల ప్యూర్ ఫైర్‌పవర్ ప్యాక్డ్ ట్రైలర్’ అంటూ చిరు తనదైన స్టైల్‌లో స్పందించారు.

ఈ సందర్భంగా పెద్ది మేకర్స్పై ప్రశంసలు కురిపించారు. రామ్ చరణ్, బుచ్చిబాబు సానా, ఏఆర్ రెహమాన్ ముగ్గురిని ప్రత్యేకంగా అభినందించారు చిరంజీవి. ‘ఒక్కొక్కరు తమ బెస్ట్ ఇచ్చారు.. కలిసి మాత్రం రఫ్ఫాడించేశారు’ అంటూ కామెంట్ చేశారు. అంతేకాదు, ఎంత ఊహించుకున్నా దానికంటే మించి ట్రైలర్ ఉందని, ఎమోషన్, ఎలివేషన్, మ్యాడ్‌నెస్ అన్నీ నెక్స్ట్ లెవల్‌లో ఉన్నాయి అంటూ చిరు తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

అయితే అసలు ట్విస్ట్ చివర్లో ఇచ్చారు చిరు. ‘చాలా రోజులయ్యింది మీకు #ChiruLeaks ఇచ్చి’ అంటూ సరదాగా పేర్కొంటూ సినిమాలోని ఓ పవర్‌ఫుల్ డైలాగ్‌ను బయటపెట్టేశారు. ‘‘మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు.. నేను పోరాడాను సారు..’’ అంటూ డైలాగ్ షేర్ చేయడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ఇక చివరగా ‘సారీ బుచ్చి బాబు.. చూసాక కంట్రోల్ తప్పా’ అంటూ చిరంజీవి చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో మరోసారి #ChiruLeaks ట్రెండ్ అవుతూ, ‘పెద్ది’పై అంచనాలు మరింత పెరిగిపోయాయి. మొత్తానికి ట్రైలర్ రిలీజ్ ముందు మెగా ఫ్యాన్స్కి చిరు భారీ బ్లాస్ట్ ఇచ్చాడు.

మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌‌‌‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందించారు. జూన్ 4న వరల్డ్‌‌వైడ్‌‌గా సినిమా విడుదల కానుంది. విడుదలకు ముందే ఈ మూవీ  టాలీవుడ్‌లోనే కాదు, దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. కేవలం రెండు సాంగ్స్, ఫస్ట్ షాట్ టీజర్, ఫ్రైల్వాన్ గ్లింప్స్‌లతోనే ప్రకంపనలు సృష్టించింది.

ALSO READ : సూర్య బాక్సాఫీస్ గర్జన.. ‘కరుప్పు’ డే 1 కలెక్షన్స్ ఎంతంటే?

ఈనెల 18న ముంబైలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌‌ను నిర్వహించనున్నారు. మే 23న భోపాల్‌లో జరిగే మ్యూజికల్ ఈవెంట్లో పెద్ది స్పెషల్ సాంగ్ రిలీజ్ చేయనున్నారు. జూన్ 2న హైదరాబాద్ లో గ్రాండ్ ప్రీరిలీజ్ వేడుకను ఏర్పాటు చేయనున్నారు.