ఈ రాఖీలను తినొచ్చు

ఈ రాఖీలను తినొచ్చు

రాఖీ పండుగనాడు రంగురంగుల రాఖీలు కొంటారు అక్కా– చెల్లెళ్లు. వెరైటీ డిజైన్లు, ప్రత్యేకమైన బ్యాండ్స్​ కోసం వెతుకుతుంటారు. వాటిలో చాలావరకు ప్లాస్టిక్​వే ఉంటాయి. వాటిలో ఇంకొన్ని నాన్-బయోడిగ్రేడబుల్ మెటీరియల్‌‌తో తయారు చేసినవి ఉంటాయి. ఇవి పది, పదిహేను రోజుల్లో ఊడిపోతాయి. అలా కాకుండా ప్రతీ రాఖీ అందంగా, పర్యావరణ అనుకూలమైందిగా కూడా ఉంటే ఎంత బాగుంటుంది. టెర్రకోట, జనపనారలతో చేసిన ఈ హ్యాండ్​ మేడ్​ రాఖీలతో పర్యావరణానికి ఎలాంటి నష్టం ఉండదు. ఇలాంటి రాఖీలను తయారుచేస్తూ మంచి రెస్పాన్స్​ పొందుతున్నారు  కొందరు మహిళలు. ఆన్​లైన్​లో ఈ రాఖీలకు మంచి డిమాండ్​ ఉంది. క్రియేటివిటీని ఉపాధిగా మార్చుకొని పర్యావరణ హిత రాఖీలను అందిస్తున్న మహిళల గురించి...

చాక్లెట్​ రాఖీలు

చాక్లెట్​ రాఖీలను బిహార్‌‌లోని గయలో గ్రామీణ మహిళలు తయారుచేస్తున్నారు. రంగు రంగులు పూలు, పక్షులు, జంతువుల ఆకారాల్లో ఈ రాఖీలు ఉంటాయి. అలాగే ట్రెండీ ఎమోజీలను కూడా  చేస్తున్నారు. ప్రతి రాఖీలో కుంకుమ, అక్షింతల  సెట్​తో ఉంటుంది. అహ్మదాబాద్ నేషనల్ ఇనిస్టిట్యూట్ లో చదువుకున్న ఉషా ప్రజాపతి ఈ విమెన్​ టీమ్​ను మొదలుపెట్టింది. బిహార్​లో వంద మందికి పైగా మహిళలు ఈ వెంచర్​ ద్వారా ఉపాధి పొందుతున్నారు. రాఖీల ధర రూ .880, రూ .1200 మధ్య ఉంటుంది. samoolam.com  వెబ్​సైట్​లో వీటిని కొనుక్కోవచ్చు. 

మట్టి రాఖీ

అహ్మదాబాద్​కు చెందిన సాచీ త్రిపాఠి అహ్మదాబాద్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ కాలేజీలో పీజీ చేసింది. లాక్​డౌన్​ టైంలో  కొందరి చేతివృత్తుల వాళ్లకు డబ్బు సాయం చేసింది. అప్పుడు వాళ్లు ‘ మాకు డబ్బు సాయం అవసరం లేదు. మేము పని చేయడానికి తయారు చేసిన ప్రొడక్ట్స్​ను మార్కెటింగ్​ చేయడానికి రెగ్యులర్​ సోర్స్​  ఇవ్వండి’ అని అడిగారు. దాంతో సాచి  ఆన్​లైన్​ మార్కెట్, ఎగ్జిబిషన్‌‌ల ద్వారా వాళ్లు చేసిన టెర్రకోట రాఖీలను అమ్ముతోంది. మీకు ఆ రాఖీలు కావాలంటే terracottabysachii.com వెబ్​సైట్​చూడండి. 

సీడ్​ రాఖీ

చాలా రాఖీలు నీళ్లతో తడిసి లేదా  దారాలు వదులై  ఊడిపోతాయి. కానీ మధ్యప్రదేశ్​, రాజస్తాన్​లోని 21 ఫూల్స్​ అనే హ్యాండ్లూమ్​ సెంటర్​ ‘సీడ్​ రాఖీ’ లను తయారు చేస్తోంది. ఈ రాఖీలకు సహజంగా రంగులు అద్ది, పత్తి నూలును చేత్తో అల్లి తయారు చేస్తారు. ఈ రాఖీల్లో గుమ్మడికాయ, అమరాంథస్, తులసి విత్తనాల వంటి  కూరగాయల విత్తనాలు ఉంటాయి. ఈ రాఖీలను చేతికి కట్టుకొని  ఆ తర్వాత  నాటవచ్చు. ఈ రాఖీలు  ఒక్కో బాక్స్​  రూ.350 నుండి రూ.400 వరకు  ఉంటాయి. వీటిని 21fools.com లో కొనుక్కోవచ్చు.