నితిన్ కు గురువంటే గౌరవం లేదు..మాటిచ్చి తప్పాడు

నితిన్ కు గురువంటే గౌరవం లేదు..మాటిచ్చి తప్పాడు

హీరో నితిన్ పై కొరియోగ్రాఫర్, డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నితిన్ కు గురువంటే గౌరవం లేదని..మాటిచ్చి తప్పారని ఆరోపించారు. అమ్మరాజశేఖర్ తాజాగా డైరెక్ట్ చేసిన మూవీ హైయ్ ఫైవ్. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. దీనికి నితిన్ రావాల్సివుండగా వ్యక్తిగత కారణాల వల్ల రాలేదని తెలుస్తోంది. దీంతో అమ్మ రాజశేఖర్ నితిన్ పై ధ్వజమెత్తారు. 

‘‘హైయ్ ఫైవ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు నితిన్ వస్తా అని చెప్పి..రాలేదు. ఆయనకు పదిరోజుల ముందే సమాచారం ఇచ్చాను. చివరి నిమిషంలో జ్వరం వచ్చింది..రాలేను అని చెప్పాడు. ఆయన ఇంట్లోనే ఉన్నారు.. ఎక్కడికి వెళ్లలేదు. కనీసం బైట్ అయినా ఇవ్వమని అడిగా.. కానీ దానికి కూడా స్పందించలేదు. నితిన్ కు డ్యాన్స్ రాకపోతే నేనే నేర్పించా. గురువంటే కనీసం గౌరవం లేదు. అతడు వస్తాడని అన్నం కూడా తినకుండా ఏవీ రెడీ చేయించా. నితిన్ రాకుండా నన్ను అవమానించాడు. సాయం చేసినవారిని ఎప్పుడు మర్చిపోకూడదు’’ అని అమ్మ రాజశేఖర్ అన్నారు. కాగా నితిన్ అమ్మ రాజశేఖర్ కాంబినేషన్ లో టక్కరి అనే మూవీ వచ్చింది. ఈ మూవీ యావరేజ్ హిట్ గా నిలిచింది.