
ఓ చేతిలో కర్ర, మరో చేతిలో టార్చ్, నెత్తిన టోపి వీధుల్లో అటూ ఇటూ తిరుగుతూ పహారా కాయడం గూర్ఖా ల పని. ఫర్ ఏ చేంజ్ ఓ రోబో గూర్ఖా గా పని చేస్తే! ఔను. చైనా మిబావో అనే రోబో చౌకీదార్ ను తయారు చేసింది. ఫేస్ రికగ్నిషన్, మనుషులతో మాట్లాడటం, థర్మల్ ఇమేజరీని క్యా ప్చర్ చేయడం వంటి అత్యాధునిక టెక్నా లజీలను ఇందులో వాడారు. ప్రస్తుతం బీజింగ్ లోని మియువన్ కమ్యూని టీ వద్ద దీన్ని కాపలాకు పెట్టారు. అక్కడ ఉండే వాళ్లకు సాయం చేయడంతో పాటు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలను మిబావో గుర్తిస్తుంది. అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తిస్తే వెంటనే కమ్యూని టీ గేట్లను హైటెక్ టెక్నాలజీ సాయంతో మూసేస్తుంది. వెంటనే ఈ సమాచారాన్ని పోలీసులకు పంపుతుంది. చైనా అకాడమీ ఆఫ్ లాంచ్ వెహికల్ టెక్నా లజీ వాళ్ల సాయంతో బీజింగ్ ఏరోస్పేస్ ఆటోమాటిక్ కంట్రోల్ ఇనిస్టిట్యూట్ దీన్ని రూపొందించింది.