
“చౌకీదార్” .. పనిచేసేది ధనవంతుల కోసమే కాని దేశంలోని పేద ప్రజల కోసం కాదని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఆమె యూపీలో నడుస్తున్న యోగి పాలనపై మండిపడ్డారు. రాష్ట్రంలో చెరకు రైతులు బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడం దురదృష్టకరమని ఉన్నారు.
రాష్ట్రంలో రైతు కుటుంబాలకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు రూ. 10,000 కోట్లపైనే ఉన్నాయని ఆమె అన్నారు. బీజేపీ ప్రభుత్వం ఈ పని చేయకపోవడంతో చెరకు రైతుల పిల్లల చదువు, ఆహారం, ఆరోగ్యం మరియు ఇతర పనులన్నీ ఎక్కడకక్కడే ఆగిపోయాయని ఆమె అన్నారు. ఇంత జరుగుతున్నా కూడా యూపీ ప్రభుత్వం వారి బకాయిలు చెల్లించే బాధ్యత కూడా తీసుకోలేదని ట్విటర్ వేదికగా అన్నారు. చౌకీదార్లు కేవలం ధనవంతుల కోసమే పనిచేస్తారని ప్రియాంక ఈ సందర్భంగా అన్నారు.