AP Fiber Net Case: ఏసీబీ కోర్టులో సీఐడీ ఛార్జీషీటు దాఖలు..A-1గా చంద్రబాబు

AP Fiber Net Case: ఏసీబీ కోర్టులో సీఐడీ ఛార్జీషీటు దాఖలు..A-1గా చంద్రబాబు

AP Fiber Net Case: ఫైబర్ నెట్  స్కామ్ కేసులో సీఐడీ ఏసీబీ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. A-1 గా టీడీపీ అధినేత చంద్రబాబు, A-2 గా వేమూరి హరికృష్ణ,A-3 గా  కోగంటి సాంబశివరావులను చేర్చింది. ఇటీవల అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో A-1 గా చంద్రబాబు, A-2 గా మాజీ మాంత్రి నారాయణను పేర్కొంటూ సీఐడీ ఛార్జ్ షీటు దాఖలు చేసిన విషయం తెలిసిందే.  

ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టు లో అక్రమాలు జరిగాయని ఏపీ సీఐడీ 2021లో కేసుల నమోదు చేసింది. గత ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కేసులో 25వ నిందితుడిగా ఉన్నారు. రూ.114 కోట్ల దుర్వినియగం చేశారని సీఐడీ ఎఫ్ ఐఆర్ కేసు నమోదు చేసింది. అయితే ఆ తర్వాత జరిగిన విచారణ లో భాగంగా చంద్రబాబును A-1 గా చేర్చారు. ప్రస్తుతం ఏసీబీ కోర్టులో విచారణ జరుగుతోంది.