క్లౌడ్ బరస్ట్ తో ఉత్తరకాశీ అతలాకుతలం.. బాధితులకు అండగా ఉండాలని సినీ ప్రముఖుల పిలుపు

 క్లౌడ్ బరస్ట్ తో ఉత్తరకాశీ అతలాకుతలం.. బాధితులకు అండగా ఉండాలని  సినీ ప్రముఖుల పిలుపు

భారీ వర్షాలు, వరదలతో ఉత్తరాఖండ్ అతలాకుతలం అవుతోంది. ఉత్తరకాశీ జిల్లాలోని ధరాలి గ్రామంలో సంభవించిన క్లౌడ్ బర్ట్స్ తో  భయానకపరిస్థితులు నెలకొన్నాయి. ఒక్కసారిగా ఖీర్ గంగానది ఉప్పొంగడంలో  ఇప్పటివరకు నలుగులు ప్రాణాలు కోల్పోగా, సుమారు 100 మందికి పైగా గల్లంతయ్యారు. ఇళ్లు , హోటళ్లు, మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. దీంతో స్థానికులు దిక్కుతోచని స్థితిలో అల్లాడుతున్నాయి. ఎటు చూసినా బాధితుల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. 

అటు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు సహాయ చర్యలు ముమ్మరం చేశాయి. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఐటీబీపీ, స్థానిక బృందాలు, డ్రోన్లు , భారీ యంత్రాలు ఉపయోగించి యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నాయి.  మరోవైపు కుండపోత వర్షాలు సహాయక చర్యలకు తీవ్ర ఆటంకంగా మారింది.  ఈ విషాదకర ఘటనపై బాలీవుడ్ ప్రముఖులు తమ సంతాపం, ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. మనమందరం కలిసికట్టుగా బాధితులకు  అండగా నిలబడాల్సిన సమయం ఇది అని స్పష్టం చేశారు.

ఉత్తరాఖండ్‌లో సంభవించిన భయంకరమైన వరదలు, మేఘవిస్ఫోటనం చూసి తన హృదయం ముక్కలైందని నటుడు సోనూ సూద్ అన్నారు. ప్రభావితమైన ప్రతి ప్రాణానికి నా ప్రార్థనలు. ప్రభుత్వం తన వంతు కృషి చేస్తున్నప్పటికీ, మనమందరం కలిసికట్టుగా నిలబడాల్సిన సమయం ఇది. ఇళ్లు, జీవితాలు కోల్పోయిన ప్రతి ఆత్మకు మనం అండగా ఉండాలి అని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.

 

ఈ భయానక విపత్తులో మృతి చెందిన వారికి సంతాపం తెలిపారు నటి సారా అలీఖాన్. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రతి ఒక్కరై సురక్షితంగా, ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాను అని  తన ఇన్ స్టా గ్రామ్ లో  పోస్ట్ చేశారు. అంతేకాకుండా, ఆమె ఉత్తరకాశీ జిల్లా అత్యవసర ఆపరేషన్ సెంటర్ జారీ చేసిన ముఖ్యమైన సంప్రదింపు నెంబర్లను కూడా షేర్ చేశారు.

 హరిద్వార్ బిడ్డగా, ఉత్తరాఖండ్‌లోని ప్రతి రాయి, ప్రతి నది, ప్రతి గాలి నా ఆత్మలో భాగం. ఈరోజు ఉత్తరకాశీలోని ఖీర్ గంగ నదిలో వినాశకరమైన వరదలను చూసి, నా భూమి, నా ప్రజలు, నా కుటుంబం... చెప్పలేని బాధను అనుభవిస్తున్నాను అని ఊర్వశి రౌతేలా తెలిపారు. సహాయం చేయడానికి తాను తన వంతుగా కృషి చేస్తానని, అభిమానులను, శ్రేయోభిలాషులను సహాయం కోసం ముందుకు రావాలని కోరారు.

ఉత్తరాఖండ్ లోని వరదలు,  హృదయ విదారక దృశ్యాలపై అడివి శేష్  స్పందించారు. ఉత్తరాఖండ్ కోసం ప్రార్థనలు. హృదయం ముక్కలయ్యే దృశ్యాలు అని తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.  ఈ ఘోర విపత్తులో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు, నిరాశ్రయులైన వారికి సహాయం చేసేందుకు అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో పరిస్థితులు హృదయవిదారకం అని భూమి పెడ్నేకర్ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.  అంతులేని అభివృద్ధి కోసం అడవులను నరికివేస్తున్నారు. ప్రకృతిని సమతుల్యం చేసే ఆలోచన లేదు. ప్రతి వర్షాకాలంలో ఈ రాష్ట్రాలు వరదలతో తీవ్రంగా విధ్వంసానికి గురవుతున్నాయి. కొన్ని దృశ్యాలు భయంకరంగా ఉన్నాయి.  ప్రకృతి ప్రకోపం ముందు మనమంతా శూన్యమే అని తెలుసుకోండి. ఇలాంటి పరిస్థితుల్లో బాధిత కుటుంబాలు ధైర్యంగా ఉండాని ప్రభుత్వాన్ని, అభిమానులకు కోరారు.

భూమి పెడ్నేకర్ ఇన్‌స్టాగ్రామ్‌లో వాతావరణ మార్పులపై తన ఆందోళన వ్యక్తం చేస్తూ, "హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో జరుగుతున్నది హృదయవిదారకం. అంతులేని అభివృద్ధి కోసం అడవులను నరికివేస్తున్నారు. ప్రకృతిని సమతుల్యం చేసే ఆలోచన లేదు. ప్రతి వర్షాకాలంలో ఈ రాష్ట్రాలు వరదలతో తీవ్రంగా విధ్వంసానికి గురవుతున్నాయి. కొన్ని దృశ్యాలు భయంకరంగా ఉన్నాయి. ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్న వారికి నా హృదయం అంకితం. ప్రకృతి ప్రకోపం ముందు మనమంతా శూన్యమే. తెలుసుకోండి," అని పోస్ట్ చేశారు.

ఉత్తరకాశీలో జరిగిన ఈ ఘోర విపత్తులో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు, నిరాశ్రయులైన వారికి సహాయం చేయడానికి ముందుకు రావాలని ఈ సెలబ్రిటీలు తమ అభిమానులకు, అనుచరులకు పిలుపునిచ్చారు. ఈ కష్ట సమయంలో వారికి అండగా ఉండాలని కోరారు.