
పొట్టేల్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో టాలీవుడ్ ప్రముఖ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ సినీ క్రిటిక్స్ మరియు సినీ జర్నలిస్టులను కించపరుస్తూ వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలో అసభ్యకర పదజాలం ఉపయోగిస్తూ సినిమా రివ్యూలు రాసేవారిని విమర్శించాడు. దీంతో సినీ క్రిటిక్స్ సంఘం నాయకులు నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అలాగే శ్రీకాంత్ అయ్యంగార్ సినీ క్రిటిక్స్ పై చేసిన వ్యాఖ్యలకుగానూ సినీ క్రిటిక్స్ సంఘం జెనరల్ సెక్రటరి ఎమ్. లక్ష్మీ నారాయణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణుకి ఫిర్యాదు చేశారు. ఇందులో భాగంగా సినీ క్రిటిక్స్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు శ్రీకాంత్ అయ్యంగార్ కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని అంతవరకూ శ్రీకాంత్ అయ్యంగార్ నటించిన సినిమాల ప్రమోషన్స్ కార్యక్రమాలకి మీడియా జర్నలిస్టులు హాజరకారని మరికొందరు జర్నలిస్టులు అంటున్నారు. దీంతో ఈ వివాదం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
ఈ విషయం ఇలా ఉండగా పొట్టేల్ సినిమా ప్రమోనషన్స్ లో శ్రీకాంత్ అయ్యంగార్ మాట్లాడుతూ 'దరిద్రానికి విరోచనాలు వస్తే..రివ్యూ రైటర్ లు పుడతారారట.. డ్రాగ్డ్‌గా ఉందన‍్నారు. షార్ట్ ఫిల్మ్ తీయడం కూడా రాని నా కొడుకులు వచ్చి రివ్యూ రాస్తారు. సినిమా తీయడం ఎంత కష్టమో రఫ్ ఐడియా కూడా లేని నా కొడుకులు అంటూ సినీ క్రిటిక్స్ పై దారుణమైన వ్యాఖ్యలు చేశారు.