గ్రూప్-1 ప్రిలిమ్స్ లో 100 మార్కులకుపైగా వచ్చిన వారికి సిట్ విచారణ

గ్రూప్-1 ప్రిలిమ్స్ లో 100 మార్కులకుపైగా వచ్చిన వారికి సిట్ విచారణ

TSPSC : టీఎస్పీఎస్పీ పేపర్ లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. తవ్వేకొద్దీ ఈ కేసులో కొత్త కొత్త విషయాలు బయటపడుతున్నాయి. గ్రూప్-1 ప్రిలిమ్స్ లో 100 మార్కులకు పైగా వచ్చిన వారి లిస్ట్ ను సిట్ అధికారులు తయారు చేశారు. టీఎస్పీఎస్పీ బోర్డు నుంచి అభ్యర్థుల సమాచారాన్ని ఇప్పటికే సేకరించారు.100 మార్కులకు పైగా వచ్చిన అభ్యర్థులు సిట్ కార్యాలయానికి రావాలని నోటీసులు ఇచ్చారు. ఈక్రమంలో మార్చి 26వ తేదీన 20 మంది అభ్యర్థులు సిట్ ఆఫీస్ లో నిర్వహించిన విచారణకు హాజరయ్యారు. మార్చి 27న మరికొందరు అభ్యర్థులు సైతం విచారణకు సిట్ ఆఫీస్ కు రానున్నారు. 

సిట్ కార్యాలయానికి వస్తున్న ఒక్కో అభ్యర్థి నుంచి 15 అంశాలపై వివరాలను సేకరిస్తున్నారు సిట్ అధికారులు. అభ్యర్థి బయోడేటాతో పాటు ఎంత వరకు చదివారు..? ప్రస్తుతం ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు...? వంటి కీలక విషయాలను అడిగి... వాటిని రికార్డ్ చేస్తున్నారు. సమాచారం సేకరించిన అనంతరం అవసరమైతే తిరిగి సంప్రదిస్తామని అభ్యర్థులకు సూచిస్తున్నారు సిట్ అధికారులు.