న్యూ ఇయర్ సెలబ్రేషన్స్​కు హైదరాబాద్ సిటీ రెడీ

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్​కు హైదరాబాద్ సిటీ రెడీ
  • గ్రాండ్​గా వెల్​కమ్ చెప్పేందుకు సిద్ధమైన సిటిజన్లు
  •     రెస్టారెంట్లు, రిసార్ట్స్, పబ్​​లలో స్పెషల్ ఈవెంట్లు
  •     టాప్ డీజే ప్లేయర్స్​తో మ్యూజికల్ నైట్స్, స్పెషల్ లైవ్ బ్యాండ్ షోలు

హైదరాబాద్, వెలుగు: కొత్త ఏడాదికి గ్రాండ్​గా వెల్ కమ్ చెప్పేందుకు సిటిజన్లు సిద్ధమయ్యారు. ఇందుకోసం ఫ్రెండ్స్​, కుటుంబసభ్యులతో కలిసి ఇంటి వద్దే ఏర్పాట్లు చేసుకుంటుండగా.. మరికొందరు రెస్టారెంట్స్, రిసార్టుల్లో సెలబ్రేట్ చేసుకునేందుకు రెడీ అయ్యారు. న్యూ ఇయర్ వేడుకల కోసం సిటీలోని పబ్​లు, రిసార్ట్​లు, రెస్టారెంట్లు స్పెషల్ ఈవెంట్లను నిర్వహించనున్నాయి. 

సెలబ్రిటీ, థీమ్ ఓరియెంటెడ్ ఈవెంట్లతో పాటు టాప్​ డీజే ప్లేయర్లతో డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్​ను సందడిగా జరిపేందుకు ఈవెంట్ ఆర్గనైజర్లు స్పెషల్ ప్రోగ్రామ్స్​ను కండక్ట్ చేస్తున్నారు. ఈవెంట్లలో స్పెషల్​గా మ్యూజికల్​ నైట్స్​, లైవ్​బ్యాండ్, డ్యాన్స్ షోలు, అన్​లిమిటెడ్​ ఫుడ్, డ్రింక్​ ఏర్పాటు చేస్తున్నారు. 

స్టార్ సింగర్స్​తో లైవ్ మ్యూజిక్..

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం జరిగే ఈవెంట్లలో​ సింగర్లతో  లైవ్​ మ్యూజిక్, ఆర్కెస్ట్రా, డీజేలను ఆర్గనైజర్లు ఏర్పాటు చేస్తున్నారు. టికెట్ రేటును బట్టి ఫ్రీగా అన్​లిమిటెడ్​ ఫుడ్​, డ్రింక్స్​ను కూడా అందించనున్నారు. కొన్ని ఈవెంట్లకు కపుల్స్ కు మాత్రమే ఎంట్రీ ఉండగా, మరికొన్ని చోట్ల ఫ్యామిలీ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. ఫ్యామిలీ ఈవెంట్లలో పిల్లల కోసం ప్రత్యేకంగా ప్లే ఏరియాలను కూడా ఏర్పాటు చేశారు. 

ప్లేసెస్​ను బట్టి  సింగిల్ స్టాగ్ రూ. 800, కపుల్స్​కు రూ.1,500 , ఫ్యామిలీ ప్యాకేజీ రూ.3 వేల నుంచి టికెట్ రేట్లు మొదలవుతున్నాయి. తాజ్ ఫలక్ నుమా ప్యాలెస్​లో ‘న్యూ ఇయర్ ఈవ్ గాలా’ పేరుతో ఈవెంట్ నిర్వహిస్తున్నారు. 21 మంది ఆర్కెస్ట్రాతో లైవ్ కన్సర్ట్ ఏర్పాటు చేశారు. మాదాపూర్​లోని బుట్టా కన్వెషన్​లో వాకింగ్ స్ట్రీట్ పేరుతో ఫ్యామిలీ ఈవెంట్ నిర్వహిస్తుండగా.. సింగర్ బాబా సెహగల్ పర్ఫామెన్స్​తో పాటు డీజే నైట్​ను ఏర్పాటు చేశారు. 

సోమాజిగూడలోని ది పార్క్​లో డీజే నోలిక్ పర్ఫామెన్స్ ఇవ్వనున్నాడు. బేగంపేటలో చిరాన్​ ఫోర్ట్ క్లబ్​లో న్యూ ఇయర్ బష్, మాదాపూర్ ఎన్ కన్వెన్షన్​లో బాలీవుడ్ నైట్ పేరుతో ఈవెంట్లు జరగనున్నాయి. ఇక సిటీ శివార్లలోని లియోనియో, పామ్ ఎక్సాటికా, అలంకృత రిసార్టుల్లోనూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరగనున్నాయి. ఈవెంట్లకు సంబంధించిన ఎంట్రీ పాస్ లు బుక్ మై షో, హై ఏప్, పేటీఎంలో అందుబాటులో ఉన్నాయి. 

డ్రాపింగ్​, రూమ్​ ఫెసిలిటీ

కొన్ని ఈవెంట్ మేనేజ్​మెంట్లు  కస్టమర్లకు ప్రత్యేక సేవలను అందిస్తున్నాయి. డ్రింక్ చేసిన కస్టమర్లను ఇంటి దగ్గర డ్రాప్ చేసేందుకు స్పెషల్ క్యాబ్ సర్వీసులను ఏర్పాటు చేస్తున్నాయి. అక్కడే స్టే చేయాలనుకునే వారికి రూమ్ ఏర్పాటు కూడా చేస్తున్నారు. వీటీకి స్పెషల్​గా చార్జీలు  వసూలు చేస్తారు.