లాక్​డౌన్​ స్ట్రెస్ నుంచి రిలీఫ్ కోసం టూర్లకు సిటిజన్స్​

లాక్​డౌన్​ స్ట్రెస్ నుంచి రిలీఫ్ కోసం టూర్లకు సిటిజన్స్​

హైదరాబాద్, వెలుగు: ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ తో  టూర్లకు, కూల్ ప్లేసెస్ కి వెళ్లడం లాంటి  ప్రోగ్రామ్స్ ను సిటిజన్లు ఎక్కువగా సమ్మర్ లో ప్లాన్ చేసుకునేవారు. కానీ ఈ ఏడాది మార్చి నుంచి కరోనా ఎఫెక్ట్, లాక్ డౌన్ రావడంతో  ట్రిప్స్ ప్లాన్ చేసుకున్నవారు, వెళ్దామనుకున్నవారు క్యాన్సిల్ చేసుకున్నారు. లాక్ డౌన్ తో నెలల తరబడి ఇంట్లోనే ఉన్న సిటిజన్లు స్ట్రెస్ రిలీఫ్ కోసం​ వింటర్ లో మళ్లీ టూర్లకు ప్లాన్ చేసుకుంటున్నారు. డిఫరెంట్ ప్లేసెస్ కి ఫ్రెండ్స్, ఫ్యామిలీతో వెళ్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

పీస్ ఆఫ్ మైండ్ కోసం..

వింటర్ లో హిల్ టాప్, కూల్ ప్లేసెస్ కు వెళ్లడం అంటే కొంచెం కొత్తే.  చాలామంది సమ్మర్ లో ఇలాంటి ప్లేసెస్ కు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఈసారి సమ్మర్ మొత్తం లాక్ డౌన్ ఉండటంతో  సీజన్ తో సంబంధంలో లేకుండా వింటర్ లోనూ సిటిజన్స్ ఇలాంటి చోట్ల వెకేషన్స్ కి వెళ్లి వస్తున్నారు. వైజాగ్, అరకు, లంబసింగి, జమ్మూకాశ్మీర్, కూర్గ్, ఊటీ, సిమ్లా, మున్నార్, తమిళనాడు, గోవా, కర్ణాటక, అసోం వంటి ప్లేసెస్ ని టూర్ల కోసం సెలక్ట్ చేసుకుంటున్నారు. లాక్ డౌన్ లో పెరిగిన స్ట్రెస్, యాంగ్జైటీ నుంచి బయటపడేందుకు, ప్రశాంతత కోసమే వింటర్ లో కూడా ఇలాంటి ప్లేసెస్ కి వెళ్లొచ్చామని సిటిజన్లు చెప్తున్నారు. ఒకేచోట ఉండి మెంటల్ గా ఎంతో స్ట్రెయిన్ అయ్యామని, అందుకే నేచర్ ప్లేసెస్ కి వెళ్లి రిలాక్స్ అవుతున్నామంటున్నారు.

జర్నీని ఎంజాయ్ చేస్తూ..

ట్రైన్, ఫ్లైట్ లో కంటే రోడ్ రూట్ లో ట్రిప్స్ కి వెళ్లడానికి చాలామంది సిటిజన్లు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కరోనా టైం కావడంతో సేఫ్టీ ప్రికాషన్స్ కోసం ఓన్ వెహికల్స్ అయితేనే బెటర్ అని ఫీలవుతున్నారు. చాలామంది సొంత కార్లు, లేదంటే రెంట్ కి  తీసుకుని రోడ్ రూట్ లోనే టూర్స్ ప్లాన్  చేసుకుంటున్నారు. దారిలో నచ్చిన ప్లేస్ లో ఆగుతూ, క్యాంప్ ఫైర్ వేసుకుని ఎంజాయ్ చేస్తూ  ప్రకృతిని ఆస్వాదిస్తూ వెళ్తున్నారు. ఫ్రెండ్స్ గ్రూప్స్ గా రోడ్ ట్రిప్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ ట్రిప్స్ ని 3 డేస్ నుంచి వన్​ వీక్​ ఉండేలా చూసుకుంటున్నారు.  మరికొందరు సడెన్ ట్రిప్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఇలాంటి వాటితో గుడ్ మెమొరీస్ ఉంటాయంటున్నారు.

ఓయో కన్స్యూమర్ సర్వే..

దీపావళి నుంచి రూమ్ బుకింగ్స్ పెరిగాయని ఓయో పేర్కొంది. కన్స్యూమర్ సర్వే  పేరుతో ఆల్ ఓవర్ ఇండియాలో తమ హోటల్స్ లో ఓయో సెప్టెంబర్ లో ఈ సర్వే కండక్ట్ చేసింది.  లాక్ డౌన్ తర్వాత సెప్టెంబర్ నుంచి ఒక్కసారిగా బుకింగ్స్ పెరిగాయని ఓయో తెలిపింది. 80 శాతం కస్టమర్లు శానిటైజ్డ్ స్టే కి ఇంట్రెస్ట్  చూపిస్తున్నారని, 40 శాతం కస్టమర్లు నెక్ట్స్ ట్రిప్స్ ప్లానింగ్ కోసం ఎంక్వైరీ చేస్తున్నారని సర్వేలో పేర్కొంది. డొమెస్టిక్ ట్రావెలింగ్ పెరిగిందని.. సిమ్లా, కులు మనాలి, గ్యాంగ్​టక్ వంటి ప్లేసెస్ లో తమ హోటల్స్ లో బుకింగ్స్ బాగా అవుతున్నాయని తెలిపింది.

కాశ్మీర్ కి వెళ్లొచ్చాం

ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఇటీవలే కాశ్మీర్ ట్రిప్ కి వెళ్లొచ్చాం. సమ్మర్ లో వెళ్లాలని అనుకున్నా  కుదరలేదు. అందుకే నవంబర్  లో ప్లాన్ చేసి వెళ్లాం. చాలా రోజుల తర్వాత వెకేషన్ కి వెళ్లడం, మా పిల్లలతో కలిసి స్నో లో ఆడటం, లేక్స్ ఎంజాయ్ చేయడం రిలాక్సింగ్ గా అనిపించింది. కాశ్మీర్ తో పాటు అసోం కూడా వెళ్లాం. మళ్లీ కూర్గ్, ఊటీ వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నాం. మేం వెళ్లిన ప్లేసెస్ లోనూ కోవిడ్ సేఫ్టీ ప్రికాషన్స్ చాలా బాగా తీసుకుంటున్నారు.‑ కీర్తి, ప్రైవేటు ఎంప్లాయ్, మణికొండ.

రిలాక్స్ అయ్యాం

లాక్ డౌన్ తర్వాత ట్రిప్  కి వెళ్లాలని ప్లాన్ ఉండేది. కరోనా వల్ల చాలా స్ట్రెస్ ఫీలయ్యాం. సిటీలో అన్ని చూసిన ప్రాంతాలే.  రిలీఫ్ పొందాలంటే నేచర్ కి మించిన బెస్ట్ ఆప్షన్ మరొకటి లేదు.  అందుకే ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్లాం. వాటర్ ఫాల్స్, నేచర్, కొండలు, పురాతన ఆలయాలు అన్ని మా ట్రిప్  లో కవర్ చేశాం. ఇప్పుడు చాలా స్ట్రెస్ రిలీఫ్ పొందాననిపిస్తోంది. – చైతన్య, ఎంప్లాయ్, దిల్​సుఖ్ నగర్