సింగరేణిలో సొంతింటి కలను నిజం చేయాలి : టి.రాజారెడ్డి

సింగరేణిలో సొంతింటి కలను నిజం చేయాలి :  టి.రాజారెడ్డి
  • సీఐటీయూ ప్రెసిడెంట్ టి.రాజారెడ్డి 

గోదావరిఖని, వెలుగు :  సింగరేణిలో సొంతింటి కళను నిజం చేయాలని సీఐటీయూ అనుబంధ సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ స్టేట్​ ప్రెసిడెంట్ టి.రాజారెడ్డి డిమాండ్​చేశారు. శనివారం గోదావరిఖని ప్రెస్​ క్లబ్​లో జరిగిన మీటింగ్​లో ఆయన మాట్లాడారు. సింగరేణి వ్యాప్తంగా ఈ నెల 11, 12 తేదీల్లో సొంతిళ్లు కావాలా..?  కంపెనీ క్వార్టర్ కావాలా.. ? అనే అంశంపై సీఐటీయూ ఆధ్వర్యంలో బొగ్గు గనుల వద్ద బ్యాలెట్​నిర్వహించామన్నారు. ఇందులో మొత్తం 22,068 మంది పాల్గొనగా, 21,836 మంది  కార్మికులు సొంతిళ్లు కావాలని ఓటు వేశారని తెలిపారు. 

ఈ నేపథ్యంలో కార్మికులు రిటైర్డ్​ అయ్యే నాటికి సొంతింటిలో నివాసం ఉండేలా సింగరేణి మేనేజ్​మెంట్​చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంలో మిగతా కార్మిక సంఘాలు స్పందించాలని, లేనిపక్షంలో కార్మికులను ఓటు అడుగొద్దని చెప్పారు. సమావేశంలో యూనియన్​ ఆర్జీ 1 ఏరియా ప్రెసిడెంట్​రాజమౌళి, సెక్రటరీ శ్రీనివాస్​, నాయకులు తదితరులు పాల్గొన్నారు.