సీసీ కెమెరాల సాయంతో నేరస్తులను ఈజీగా గుర్తిస్తున్నం : సిటీ సీపీ ఆనంద్

సీసీ కెమెరాల సాయంతో నేరస్తులను ఈజీగా గుర్తిస్తున్నం : సిటీ సీపీ ఆనంద్

ముషీరాబాద్/శంషాబాద్, వెలుగు : సీసీ కెమెరాల ఏర్పాటుతో ఇన్వెస్టిగేషన్ తీరే మారిపోయిందని.. వాటి సాయంతో నేరస్తులను ఈజీగా గుర్తిస్తున్నామని సిటీ సీపీ ఆనంద్ తెలిపారు. సిటీలో ఎక్కువగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో మహిళల్లో భద్రతా భావం పెరిగిందన్నారు. సెంట్రల్ జోన్ పరిధిలోని కీలకమైన జంక్షన్లలో 34 చోట్ల కొత్తగా ఏర్పాటు చేసిన 77 సీసీ కెమెరాలను చిక్కడపల్లిలోని త్యాగరాయగాన సభలో సీపీ ఆనంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీసీ కెమెరాల సాయంతో దొంగలు, చైన్​స్నాచర్లను ఈజీగా పట్టుకోగలుగుతున్నామని ఆయన చెప్పారు.

కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠాగోపాల్, సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు, అడిషనల్ డీసీపీ రమణా రెడ్డి, చిక్కడపల్లి, అబిడ్స్, సైఫాబాద్ ఏసీపీలు, తదితరులు పాల్గొన్నారు. శంషాబాద్ పరిధి నర్కుడ గ్రామపంచాయతీలోని అమ్మపల్లి దేవాలయ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 16 సీసీ కెమెరాలను జోన్ డీసీపీ నారాయణరెడ్డి ప్రారంభించారు. అనంతరం శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్​ను ఆయన సందర్శించారు. రికార్డులు, సిబ్బంది పనితీరును 
పరిశీలించారు.